పిల్లలతో సూపర్ స్టార్ సందడి

సోషల్ మీడియాలో సందడి చేస్తున్న మహేష్ బాబు, గౌతమ్, సితారల ఫోటో

  • Published By: sekhar ,Published On : January 3, 2019 / 08:29 AM IST
పిల్లలతో సూపర్ స్టార్ సందడి

సోషల్ మీడియాలో సందడి చేస్తున్న మహేష్ బాబు, గౌతమ్, సితారల ఫోటో

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొఫెషన్‌‌నీ, పర్సనల్ లైఫ్‌‌నీ చక్కగా బ్యాలన్స్ చేస్తాడు. షూటింగ్‌కి ఏమాత్రం కాస్త గ్యాప్ దిరికితే చాలు, భార్యా, పిల్లల్ని తీసుకుని విదేశాల్లో వాలిపోతాడు. ఇప్పుడు కూడా మహర్షి షూట్‌కి కొంచెం గ్యాప్ ఇవ్వడంతో, న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి, కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్ వెళ్ళాడు. ఇప్పటి వరకూ, మహేష్ దుబాయ్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలతో పాటు ఫ్యామిలీతో ఉన్న పిక్స్, సితార మహేష్‌తో డ్యాన్స్ చేస్తున్న పిక్స్ బయటకి వచ్చాయి. రీసెంట్‌గా ఒక లేటెస్ట్ పిక్, సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 

ఆ పిక్‌లో మహేష్, గౌతమ్, సితారలతో కలిసి ఒక రెస్టారెంట్‌లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడు. టీ షర్ట్, అడిడాస్ క్యాప్, గాగుల్స్‌తో, సూపర్ స్టార్ స్టైలిష్‌గా ఉన్నాడు. పిల్లలకి సూప్ ఎలా తాగాలో జాగ్రత్తలు చెబుతుండగా, నమ్రత పిక్ తీసినట్టుంది. పిల్లలతో మహేష్, సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్న ఈ ఫోటోని ఫ్యాన్స్, సూపర్ స్టార్ సూపర్ అంటూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా, మహర్షి సెకండ్ లుక్ రిలీజ్ చెయ్యగా, అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. కొద్ది రోజుల తర్వాత తిరిగి మహర్షి షూటింగ్‌కి అటెండ్ అవుతాడు మహేష్.