Mahesh Babu : షూటింగ్ కోసం దుబాయ్‌కి మహేష్ బాబు.. కానీ గుంటూరు కారం కోసం కాదు..

మహేష్ బాబు షూటింగ్ కోసం దుబాయ్‌ బయలుదేరారు. అయితే ఆ షూటింగ్ గుంటూరు కారం మూవీకి సంబంధించింది కాదు.

Mahesh Babu : షూటింగ్ కోసం దుబాయ్‌కి మహేష్ బాబు.. కానీ గుంటూరు కారం కోసం కాదు..

Mahesh Babu off to dubai for shooting but not for Guntur Kaaram

Updated On : December 29, 2023 / 10:44 AM IST

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ సిద్దమవుతుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఈ మూవీలోని పాటల చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో మహేష్, శ్రీలీల పై ఓ మాస్ సాంగ్ ని చిత్రీకరించారు.

ఆ సాంగ్ తరువాత కొన్ని ప్యాచ్ వర్క్స్ పూర్తి చేసి గురువారంతో షూటింగ్ పూర్తి చేసేసినట్లు సమాచారం. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు.. దుబాయ్ కి బయలుదేరారు. అక్కడ ఒక యాడ్ షూటింగ్ కోసం వెళ్తున్నారట. అలాగే ఒక షార్ట్ ఫ్యామిలీ వెకేషన్ ని కూడా ప్లాన్ చేశారట. యాడ్ షూటింగ్ పూర్తి చేసిన తరువాత అక్కడే ఒకటిరెండు రోజులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి తిరిగి రానున్నారట.

Also read : Kalki 2898 AD : బాంబే ఐఐటి ఫెస్ట్‌లో కల్కి పోస్టర్స్ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

నేడు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మహేష్, నమ్రత, గౌతమ్, సితార.. దుబాయ్ కి బయలుదేరారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే, గుంటూరు కారం టీం ఈరోజు ఉదయం ఒక అప్డేట్ ఇచ్చింది. ఉదయం 11 గంటలకు సూపర్ అప్డేట్ ఉందంటూ పేర్కొన్నారు. ఆ అప్డేట్ మహేష్, శ్రీలీల మాస్ సాంగ్ అని తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో మొత్తం 4 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయట. ఒక పాట మహేష్ మీద చిత్రీకరించారు. రెండు పాటలు శ్రీలీలతో చిత్రీకరించారు. మరో పాట కథలో భాగంగా ఉంటుందని చెబుతున్నారు. అంటే సినిమాలో మీనాక్షి చౌదరి, మహేష్ మధ్య ఏ సాంగ్ ఉండదా అనే సందేహం మొదలవుతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జనవరి 12న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.