Mahesh Babu : మహేష్ పర్సనల్ మేకప్ మెన్ ఇంట్లో విషాదం.. అందుబాటులో లేని మహేష్, ఇంటికి వెళ్లి ఓదార్చిన నమ్రత..

మహేష్ తన దగ్గర పనిచేసే వాళ్ళని కుటుంబ సభ్యులుగా చూసుకుంటాడు. వారికి ఏమన్నా కష్టాలు వచ్చినా సపోర్ట్ గా నిలబడతాడు. ముఖ్యంగా మహేష్ పర్సనల్ మేకప్ మెన్ పట్టాభిని సొంత కుటుంబంగా భావిస్తాడు...................

Mahesh Babu : మహేష్ పర్సనల్ మేకప్ మెన్ ఇంట్లో విషాదం.. అందుబాటులో లేని మహేష్, ఇంటికి వెళ్లి ఓదార్చిన నమ్రత..

Mahesh Babu personal makeup men pattabhi father passed away

Updated On : February 12, 2023 / 9:55 AM IST

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే త్రివిక్రమ్ తో చేస్తున్న SSMB28 సినిమా షూట్ కి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా రెండు రోజుల క్రితమే మహేష్ స్పెయిన్ వెళ్లారు. ఇక మహేష్ తన దగ్గర పనిచేసే వాళ్ళని కుటుంబ సభ్యులుగా చూసుకుంటాడు. వారికి ఏమన్నా కష్టాలు వచ్చినా సపోర్ట్ గా నిలబడతాడు. ముఖ్యంగా మహేష్ పర్సనల్ మేకప్ మెన్ పట్టాభిని సొంత కుటుంబంగా భావిస్తాడు.

అనేకసార్లు పట్టాభి గురించి మీడియాతో చెప్పడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేశాడు మహేష్. తన చిన్నప్పటి నుండి కూడా దాదాపు అన్ని సినిమాలకి మహేష్ కి పర్సనల్ మేకప్ మెన్ అవ్వడంతో ఆయన్ని సొంత మనిషిలా చూసుకుంటాడు. అతని పిల్లల చదువులకు కూడా సహాయం చేశాడు మహేష్. తాజాగా మహేష్ బాబు పర్సనల్ మేకప్ మెన్ పట్టాభి ఇంట్లో విషాదం నెలకొంది. పట్టాభి తండ్రి శనివారం నాడు ఆరోగ్య సమస్యలతో మరణించారు.

James Camaron : రాజమౌళి సినిమా నన్ను ఇండియన్ సినిమా గురించి ఆలోచించేలా చేసింది.. జేమ్స్ కామెరూన్ వ్యాఖ్యలు

అయితే మహేష్ ఇటీవలే స్పెయిన్ వెళ్లడంతో అందుబాటులో లేడు. పట్టాభితో ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. మహేష్ లేకపోవడంతో మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ పట్టాభి ఇంటికి వెళ్లి పట్టాభి తండ్రికి నివాళులు అర్పించి ఆ కుటుంబ సభ్యులని ఓదార్చింది. దీంతో నమ్రత పట్టాభి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.