Mahesh Babu : చిన్నారుల పాలిట దేవుడు మహేష్.. 1058వ ప్రాణం..

తాజాగా మరో చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేశారు మహేష్. దీంతో ఇప్పటి వరకు 1058 మంది పిల్లలని కాపాడారు మహేష్ బాబు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.

Mahesh Babu : చిన్నారుల పాలిట దేవుడు మహేష్.. 1058వ ప్రాణం..

Mahesh

Updated On : January 21, 2022 / 11:42 AM IST

Mahesh Babu :  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూ మరో పక్క ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేస్తూ ఉంటారు. మహేష్ చేసే సేవ కార్యక్రమాల్లో ముఖ్యంగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకి చేయూతనిస్తాడు. ఇప్పటి వరకు 1057 మంది చిన్నారులను బతికించాడు మహేష్. డబ్బుల్లేని పేదచిన్నారులలో హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారిని తన సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయిస్తాడు. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులకి ఊపిరి పోసి వారి పాలిట దైవంగా మారాడు.

Samantha : విడాకుల పోస్ట్ డిలీట్ చేసిన సమంత

తాజాగా మరో చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేశారు మహేష్. దీంతో ఇప్పటి వరకు 1058 మంది పిల్లలని కాపాడారు మహేష్ బాబు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. సహస్ర అనే ఒక సంవత్సరం పాపకి కావాల్సినవి సమకూర్చి ఆంద్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయించారని, ప్రస్తుతం ఆ పాప క్షేమంగా ఉందని తెలిపారు నమ్రత. దీంతో ప్రేక్షకులు, మహేష్ అభిమానులు మరోసారి మహేష్ ని పొగిడేస్తున్నారు.