Mahesh Babu : మహేష్ బాబు ఫారిన్ వెళ్ళింది.. డాక్టర్‌ని కలుసుకోవడం కోసమా.. రీజన్ ఏంటి..!

మహేష్ బాబు ఫారిన్ వెళ్ళింది ఒక డాక్టర్‌ని కలుసుకోవడం కోసమా..? అయితే ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా మహేష్ ఆ డాక్టర్‌ని..

Mahesh Babu went Germany to meet doctor not for SSMB29 movie

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా జెర్మనీకి సోలో ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఫారిన్ కి ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్లే మహేష్.. ఈసారి ఒంటరిగా వెళ్లడంతో అభిమానులంతా SSMB29కి సంబందించిన వర్క్ కోసం వెళ్తున్నారని అనుకున్నారు. అయితే మహేష్ జెర్మనీ వెళ్ళింది ఒక డాక్టర్‌ని కలుసుకోవడం కోసమట. మహేష్ బాబు పోస్ట్ చేసిన తాజా ఫొటోతో అది తెలిసింది.

మహేష్ బాబు ఆ డాక్టర్ ని కలుసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2023 ఏప్రిల్, 2022 జూన్‌లో కూడా మహేష్ ఆ డాక్టర్ ని కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో మహేష్ తో దిగిన ఫోటోలను ఆ డాక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇంతకీ అసలు ఆ డాక్టర్ ఎవరు..? మహేష్ అతని దగ్గర ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు..? అనే ప్రశ్నలకు కూడా ఆ డాక్టర్ ఇన్‌స్టాగ్రామ్ లోనే సమాధానం దొరుకుతుంది.

Also read : Ranbir – Alia : అలియా ఎంకరేజ్ వల్లే.. ‘యానిమల్’లో ఇంటిమేట్ సీన్స్ చేశా.. రణబీర్ కామెంట్స్

ఆ డాక్టర్ పేరు ‘హరీ కొనిగ్’. అతను బాడీ ఫిట్‌నెస్ కి సంబంధించిన డాక్టర్ అని తెలుస్తుంది. ఈమధ్య కాలంలో మహేష్ తన ఫిట్‌నెస్ పై ఎక్కువ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గ్యాప్ దొరుకుంతుంటే చాలు జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా మహేష్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.

కాగా ఈ వర్క్ అవుట్స్ అన్ని SSMB29 సినిమా కోసమే అని తెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాలో మహేష్ థ్రిల్లింగ్ యాక్షన్ స్టంట్స్ చేయబోతున్నారట. అందుకే ఈ ఫిట్‌నెస్ మంత్రా అని తెలుస్తుంది. కాగా మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యిందని రైటర్ విజయేంద్రప్రసాద్ ఇటీవల అభిమానులకు తెలియజేశారు. మరి ఈ మూవీ ఎప్పుడు పట్టాలు ఎక్కబోతుందో చూడాలి.