Mahesh Babu: మహేష్ స్టైలిష్ లుక్.. మరో పదేళ్లు కొట్టేవాడే రాడేమో!

మహేష్ బాబు వయసు 45 ఏళ్ళు.. ఈ ఫోటో చూసి చెప్పండి ఆ మాట అంటారా. నిజమే.. అదేంటో హీరోలందరూ వయసు మీదపడుతుంటే తెగ గాబరా పడిపోతున్నా మహేష్ మాత్రం వయసు మీదపడే కొద్దీ నవయువకుడిలా మారిపోతున్నాడు. అందుకు నిదర్శనం ఈ ఫోటోనే. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకొచ్చే టీనేజ్ హీరోలకు ఏ మాత్రం తగ్గనంతగా మహేష్ తన లుక్ మార్చుకోవడం నిజంగా వావ్ అనాల్సిందే.

Mahesh Babu: మహేష్ స్టైలిష్ లుక్.. మరో పదేళ్లు కొట్టేవాడే రాడేమో!

Mahesh Babu

Updated On : August 8, 2021 / 6:02 PM IST

Mahesh Babu: మహేష్ బాబు వయసు 45 ఏళ్ళు.. ఈ ఫోటో చూసి చెప్పండి ఆ మాట అంటారా. నిజమే.. అదేంటో హీరోలందరూ వయసు మీదపడుతుంటే తెగ గాబరా పడిపోతున్నా మహేష్ మాత్రం వయసు మీదపడే కొద్దీ నవయువకుడిలా మారిపోతున్నాడు. అందుకు నిదర్శనం ఈ ఫోటోనే. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకొచ్చే టీనేజ్ హీరోలకు ఏ మాత్రం తగ్గనంతగా మహేష్ తన లుక్ మార్చుకోవడం నిజంగా వావ్ అనాల్సిందే.

అరే మహేష్ ఏజ్ పెరుగుతుంది.. మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చేసే హీరో ఎవరా అని లెక్కలేసే వారికి మరో పదేళ్లు నో ఛాన్స్ అని ఒక్క ఫోటోతో చెప్పకనే చెప్పేశాడు. రేపు ఆగస్టు 9కి ఆయన వయసు మరో నెంబర్ మారనుండగా.. ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అన్నట్లుగా తనలో కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా బిజీలో ఉన్నాడు. ఈ సినిమా కోసం మహేష్ న్యూ లుక్ ట్రై చేస్తున్నారు. మహేష్ బాగా పెరిగిన జులపాలు, కొంచెం గడ్డంతో కనిపిస్తున్నారు.

కాగా, పుట్టినరోజు కోసం ఇప్పటికే సర్కారు వారి టీం బర్త్ బ్లాక్ బస్టర్ పేరుతో స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుండగా ఈలోగా యమా స్టైలిష్ ఫోటో ఒకటి బయటకి వచ్చింది. స్లిక్‌, స్టైలిష్‌, సూప‌ర్ స్మార్ట్ లుక్‌తో ఈ ఫొటోలో క‌నిపిస్తున్న మ‌హేశ్.. ఫార్మ‌ల్ ఔట్‌ఫిట్‌లో స్టైల్‌కే బాస్‌లాగా.. మ‌రింత యంగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక, ‘సర్కారువారి పాట’ నుండి రేపు (ఆగస్ట్ 9) ఉదయం 9 గంట‌ల 9 నిమిషాల‌కు, బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్‌ను విడుద‌ల చేసి ఫ్యాన్స్‌కు, సినీ అభిమానుల‌కు ట్రీట్ అందించ‌బోతున్నారు. దీంతో పాటు స్పెష‌ల్ డే రోజున‌ మ‌రిన్ని స్పెష‌ల్ అనౌన్స్‌మెంట్స్ ఉండ‌బోతున్నాయి. రీసెంట్‌గా ‘స‌ర్కారువారి పాట‌’ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ రిపోర్ట్‌, జీఐఎఫ్‌ల‌కు అత్య‌ద్భుత‌మైన స్పంద‌న రాగా.. ఇప్పుడు ఫ్యాన్స్ సర్కారు వారి పాట నుంచి రాబోతున్న బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

ప‌రశురాం తెర‌కెక్కిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ఇది వ‌ర‌కెన్న‌డూ లేనంత స్టైలిష్ లుక్‌లో మ‌హేశ్ క‌నిపించ‌బోతున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్న ‘స‌ర్కారువారి పాట‌’ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.