Yatra 2 : ఆ స్పెష‌ల్ డే రోజు అప్డేట్.. యాత్ర 2 గురించి హింట్ ఇచ్చిన దర్శకుడు..!

యాత్రతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు మహీ వి రాఘవ్‌ యాత్ర 2 ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి ఒక హింట్ ఇచ్చాడు.

Yatra 2 : ఆ స్పెష‌ల్ డే రోజు అప్డేట్.. యాత్ర 2 గురించి హింట్ ఇచ్చిన దర్శకుడు..!

Mahi V Raghav gave hint on Yatra 2 YS Jagan Mohan Reddy

Updated On : June 29, 2023 / 8:35 PM IST

Yatra 2 : మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. వైఎస్‌ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించిన ఈ చిత్రం 2019 ఎన్నికల సమయంలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మహీ వి రాఘవ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ మూవీకి సీక్వెల్ తీసుకు వస్తానంటూ ఈ దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. యాత్ర 2 స్టోరీ లైన్ వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) కథతో ఉండబోతుందని చెప్పుకొచ్చాడు.

Sushant Singh Rajput : సుశాంత్‌ సింగ్‌ కేసులో పురోగతి.. బలమైన సాక్ష్యాలు ఉన్నాయని.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు!

వైఎస్ జగన్ పాదయాత్ర దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయ్యి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో సినిమా ఎండ్ అవ్వబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ గత కొన్ని నెలలుగా సాగుతూనే ఉంది. తాజాగా ఆ వర్క్స్ అన్ని పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. మహీ వి రాఘవ్‌.. తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌లో జూలై 8 2023 అని మాత్ర‌మే రాసుకొచ్చాడు. అయితే ఆ రోజు దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి కావడం విశేషం. దీంతో ఆ రోజునే యాత్ర 2 గురించి అప్డేట్స్ రానున్నాయని తెలుస్తుంది.

Tholi Prema : పవన్ తొలిప్రేమ క్లైమాక్స్ చూస్తే అమితాబ్‌కి చిరాకు వచ్చిందట.. కోపంతో ఆయన ఏమి చేశాడంటే!

కాగా ఈ సినిమాలో జగన్ రోల్ ని తమిళ నటుడు జీవా నటించబోతుండటంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి మహీ వి రాఘవ్‌ ప్రధాన పాత్రలు కోసం ఎవర్ని ఎంపిక చేసుకుంటాడో చూడాలి. ఇది ఇలా ఉంటే, రామ్ గోపాల్ వర్మ కూడా జగన్ జీవితాన్ని ఆధారంగా తీసుకోని వ్యూహం, శపథం సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో జగన్ పాత్రని తమిళ్ నటుడు ‘అజ్మల్ అమీర్’ పోషిస్తున్నాడు. వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ కనిపించబోతుంది.