Mahi V Raghava: త్వరలోనే ‘సేవ్ ది టైగర్స్’ సీక్వెల్ తెరకెక్కిస్తాం – మహి వి రాఘవ

ఇటీవల డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు దర్శకుడు మహి వి రాఘవ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు.

Mahi V Raghava: త్వరలోనే ‘సేవ్ ది టైగర్స్’ సీక్వెల్ తెరకెక్కిస్తాం – మహి వి రాఘవ

Mahi V Raghava Says Will Start Save The Tigers Sequel Soon

Mahi V Raghava: టాలీవుడ్‌లో ఇటీవల వరుస వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల రిలీజ్ అయిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కామెడీ వెబ్ సిరీస్‌ను తేజ కాకుమాను డైరెక్ట్ చేయగా, మహి వి. రాఘవ, ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్‌కు క్రియేటర్స్‌గా వ్యవహరించారు.

Save The Tigers : ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ ప్రెస్ మీట్ గ్యాలరీ..

ఈ వెబ్ సిరీస్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో సేవ్ ది టైగర్స్ టీమ్ సంతోషంగా ఉన్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపేందుకు దర్శకుడు మహి వి రాఘవ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. కంటెంట్ బాగున్న వెబ్ సిరీస్‌కు ప్రేక్షకులు ఎప్పటికీ మంచి రెస్పాన్స్‌ను అందిస్తారని సేవ్ ది టైగర్స్ మరోసారి ప్రూవ్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయ్యిందని.. ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు అడుగుతున్నారని మహి వి రాఘవ తెలిపారు.

Save The Tigers : సేవ్ ది టైగర్స్ అంటున్న ప్రియదర్శి, అభినవ్..

అయితే, ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని..త్వరలోనే ఈ సీక్వెల్‌ను స్టార్ట్ చేస్తామని మహి వి రాఘవ తెలిపారు. కాగా ప్రస్తుతం తాను సైతాన్ అనే కొత్త వెబ్ సీరీస్‌తో రాబోతున్నట్లుగా తెలిపారు. యాత్ర 2 స్క్రిప్ట్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నట్లుగా మహి వి రాఘవ తెలిపారు.