Malaika Arora: మలైకా అరోరా ‘Yes’ చెప్పింది అర్జున్ కపూర్‌కి కాదట.. మరెవరికి?
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతుంది. ఇటీవల మలైకా తన ఇన్‌స్టాగ్రామ్ లో 'I Said Yes' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో అర్జున్ కపూర్ మ్యారేజ్ ప్రపోసల్ కి మలైకా ఓకే చెప్పేసింది, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనుకుని ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే మలైకా అందర్నీ షాక్ కి గురి చేస్తూ...

Malaika Arora says Yes to Hotstar not to Arjun Kapoor
Malaika Arora: షారుఖ్ ఖాన్ ‘చైయ్య చైయ్య’ సాంగ్ లో తన ఒంపుసొంపులతో భారతదేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన నటి ‘మలైకా అరోరా’. ‘మున్నీ బద్నామ్ హుయ్’ అంటూ మూవీలో స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయిన ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ఐటమ్ సాంగ్స్ లోను నటించింది. మహేష్ బాబు – అతిధి, పవన్ కళ్యాణ్ – గబ్బర్ సింగ్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది.
Malaika Arora & Arjun Kapoor: అర్జున్ కపూర్‌కి ఓకే చెప్పేసిన మలైకా.. వైరల్ అవుతున్న పోస్ట్..
ఇక విషయానికి వస్తే.. ఈ 49 ఏళ్ళ బ్యూటీ, బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతుంది. 12 ఏళ్ళు ఏజ్ డిఫరెన్స్ ఉన్న వీరిద్దరూ 4 సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నారు. కాగా ఇటీవల మలైకా తన ఇన్‌స్టాగ్రామ్ లో ‘I Said Yes’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో అర్జున్ కపూర్ మ్యారేజ్ ప్రపోసల్ కి మలైకా ఓకే చెప్పేసింది, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనుకుని ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే మలైకా అందర్నీ షాక్ కి గురి చేస్తూ, తను ‘Yes’ చెప్పింది అర్జున్ కి కాదని వెల్లడించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ అమ్మడు ఎస్ చెప్పింది.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టార్ట్ అయ్యే న్యూ రియాలిటీ షో ‘మూవింగ్ విత్ మలైకా’ కోసమని నేడు సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ అంత షాక్ కి గురయ్యారు. కాగా మలైకా కి ఆల్రెడీ పెళ్లి అయ్యి, 2017లో విడాకులు తీసుకుంది. అంతేకాదు ఈమెకు 20 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
View this post on Instagram