Malavika – Prabhas : మా అమ్మ ఫుడ్ తర్వాత ప్రభాస్ ఫుడ్డే బెస్ట్.. రాజాసాబ్ సెట్లో..
ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో తమిళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
Malavika Mohanan – Prabhas : ప్రభాస్ సినిమా సెట్స్ లో హీరోయిన్స్ కి, ఆర్టిస్టులకు అప్పుడప్పుడు ఇంటినుంచి పలు రకాల ఫుడ్ తెప్పించి మరీ పెడతాడని తెలిసిందే. ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి, ప్రభాస్ ఫుడ్ తో చేసే మర్యాద గురించి ఆర్టిస్టులు, ప్రభాస్ తో పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా హీరోయిన్స్ గొప్పగా చెప్తారు. ఇప్పటిదాకా ప్రభాస్ తో పని చేసిన ప్రతి హీరోయిన్ ప్రభాస్ పెట్టిన ఫుడ్ గురించి మాట్లాడారు. తాజాగా ఆ లిస్ట్ లో మరో హీరోయిన్ చేరింది.
ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో తమిళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా తాను నటించిన విక్రమ్ తంగలాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ప్రభాస్ రాజాసాబ్ గురించి ప్రశ్నలు ఎదురవ్వగా ప్రభాస్ ఫుడ్ గురించి, రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడింది.
Also Read : Pawan Kalyan – Vikram : డిప్యూటీ సీఎం అవ్వడం మామూలు విషయం కాదు.. పవన్‌పై విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మాళవిక మోహనన్ ప్రభాస్ పెట్టె ఫుడ్ గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో బెస్ట్ ఫుడ్ నాకు ప్రభాస్ పంపించాడు. మా అమ్మ ఫుడ్ తర్వాత నేను ఇప్పటివరకు తిన్న ఫుడ్ లో బెస్ట్ ఫుడ్ ప్రభాస్ సర్ పంపించిందే. ఆల్మోస్ట్ మా అమ్మ ఫుడ్ కి ఈక్వల్ గా ఉంటుంది. అని తెలిపింది. ఇక రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ సర్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ రావడం నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఆ క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. మారుతీ సర్ ఫిమేల్ క్యారెక్టర్స్ బాగా రాస్తారు. మీరంతా రాజాసాబ్ చూడాలని ఎదురుచూస్తున్నాను. తంగలాన్ లోని నా పాత్రకు పూర్తి వ్యతిరేకంగా రాజాసాబ్ పాత్ర ఉంటుంది అని తెలిపింది.