Mohanlal : ఏనుగు దంతాల కేసులో మోహన్ లాల్‌కు హైకోర్ట్‌లో ఎదురు దెబ్బ..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. గత కొంత కాలంగా ఏనుగు దంతాల కేసులో చిక్కుకొని కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాడు. కేరళ స్టార్ హీరో ఇటువంటి కేసులో కోర్ట్ మెట్లు ఎక్కడం ఏంటని ఆలోచిస్తున్నారా? గతంలో మోహన్ లాల్ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.

Mohanlal : ఏనుగు దంతాల కేసులో మోహన్ లాల్‌కు హైకోర్ట్‌లో ఎదురు దెబ్బ..

malayala star mohanlal ivory case is once again go to anquiry

Updated On : February 23, 2023 / 1:05 PM IST

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. గత కొంత కాలంగా ఏనుగు దంతాల కేసులో చిక్కుకొని కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాడు. కేరళ స్టార్ హీరో ఇటువంటి కేసులో కోర్ట్ మెట్లు ఎక్కడం ఏంటని ఆలోచిస్తున్నారా? గతంలో మోహన్ లాల్ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలో రెండు ఏనుగు దంతాలు ఐటీ అధికారులకు ఇంటిలో దొరికాయి. వాటిని సీజ్ చేసిన అధికారులు వన్య ప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్ పై కేసు నమోదు చేశారు. ఇక దీనిని తప్పుబడుతూ పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్ట్ తీర్పుని ఇచ్చింది.

Actor Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కు ఈడీ నోటీసులు

దీంతో కేరళ హైకోర్ట్ ని ఆశ్రయించాడు మోహన్ లాల్. అలంకరణ కోసం అక్రమంగా ఏనుగు దంతాలను ఇంటిలో పెట్టుకోవడం తప్పు అని తెలియదా? అని కోర్ట్ అడిగిన ప్రశ్నకు మోహన్ లాల్.. చట్ట ప్రకారం గానే ఆ దంతాలను కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో దీని పై విచారణ జరపాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దంతాలు చనిపోయిన ఏనుగువి అని. మోహన్ లాల్ చట్టాన్ని ఉల్లంఘించలేదని, చట్ట ప్రకారం గానే ఆ దంతాలను ఇంటిలో పెట్టుకున్నట్లు కోర్ట్ కు తెలియజేసింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్ట్ తప్పు పట్టింది. ఒక సామాన్యుడు ఏనుగు దంతాలను కొనుగోలు చేసి ఇంటిలో పెట్టుకుంటే, అతడికి కూడా ఇలానే నివేదిక ఇచ్చేవారా? అంటూ ప్రశ్నించింది. ఇక మేజిస్ట్రేట్ కోర్ట్ మరియు మోహన్ లాల్ తరుపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు మరోసారి వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని కొట్టేవేయాలి అంటూ మోహన్ లాల్ దాఖలు చేసిన పిటిషన్ ని హై కోర్ట్ కొట్టేసింది.