Prithviraj Sukumaran : మొన్న చిరంజీవికి, నిన్న రజినీకాంత్ కి నో చెప్పిన స్టార్ హీరో.. పిలిచి సినిమా ఆఫర్ ఇస్తే..
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు.

Malayalam Hero Prithviraj Sukumaran Rejects Chiranjeevi and Rajinikanth Movie Offers
Prithviraj Sukumaran : స్టార్ హీరోలు, సీనియర్ హీరోలతో కలిసి అందరూ పనిచేయాలనుకుంటారు. ఇక పిలిచి సినిమా ఆఫర్ ఇస్తే ఎగిరి గంతేసుకుంటూ సినిమా చేస్తారు. కానీ ఈ స్టార్ హీరోకి మాత్రం పిలిచి ఆఫర్ ఇచ్చినా చేయడానికి కుదరలేదంట. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు. లూసిఫర్, బ్రో డాడీ.. లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆయనే తీసాడు. త్వరలో లూసిఫర్ సీక్వెల్ తో రాబోతున్నాడు.
తాజాగా లూసిఫర్ సీక్వెల్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ ఈవెంట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. లైకా నిర్మాణ సంస్థ గతంలో రజినీకాంత్ హీరోగా నన్ను ఒక సినిమా డైరెక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చింది. ఈ విషయం రజినీకాంత్ గారికి కూడా తెలుసు. నాలాంటి వాడికి ఇది గొప్ప అవకాశం. నేను ఆ సినిమా చేద్దామని ప్రయత్నించాను. కానీ నేను ఫుల్ టైం నటుడిని, పార్ట్ టైం దర్శకుడిని. పలు కారణాలతో రజినీకాంత్ గారి కోసం కథ రెడీ చేయలేపోయాను. దాంతో ఆ సినిమాకి నో చెప్పాల్సి వచ్చింది. కానీ ఇదే బ్యానర్ లో హీరోగా ఒక సినిమా మాత్రం ఓకే అయింది. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అని తెలిపారు.
దీంతో రజినీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమాని డైరెక్ట్ చేయమని ఛాన్స్ ఇస్తే కుదరలేదు అని ఎలా చెప్పావు అంటూ పలువురు నెటిజన్స్ పృథ్వీరాజ్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే పృథ్వీరాజ్ ఇప్పుడు రజినీకాంత్ నే కాదు గతంలో చిరంజీవికి కూడా రెండు సార్లు నో చెప్పాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన లూసిఫర్ సినిమాని మెగాస్టార్ తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమాని డైరెక్ట్ చేయమని మొదట పృథ్వీరాజ్ సుకుమారన్ కే ఛాన్స్ ఇచ్చారు. కానీ అప్పుడు వేరే సినిమా షూటింగ్స్ తో బిజీ ఉండటంతో చిరంజీవికి నో చెప్పాడు పృథ్వీరాజ్. అలాగే గతంలో సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా చిరంజీవి పిలిచి ఓ కీ రోల్ ఇస్తే కుదరక నో చెప్పాడు. ఈ విషయాన్ని సలార్ ప్రమోషన్స్ లో తెలిపాడు.
Also Read : Pushpa 2 OTT : ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఈ వారంలోనే.. ఎప్పుడో తెలుసా?
ఇలా టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ ఇద్దరూ సినిమా ఆఫర్ ఇచ్చినా పృథ్వీరాజ్ సుకుమారన్ కి కుదరలేదు అని నో చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసిన ఈ లూసిఫర్ సీక్వెల్ సినిమా మార్చ్ 27న రిలీజ్ కానుంది.