Janhvi – Khushi Kapoor : అక్కాచెల్లెళ్లు జాన్వీ, ఖుషి.. ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు.. అక్కలాగే చెల్లి కూడా పెళ్లి గురించి ఏమందంటే..

జాన్వీ లాంటి బాలీవుడ్ అమ్మాయి ఇవన్నీ చెప్తే కొత్తగా ఉన్నాయి అనుకుంటే జాన్వీ చెల్లి, శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా అక్కలాగే ఆలోచిస్తుంది.

Janhvi – Khushi Kapoor : అక్కాచెల్లెళ్లు జాన్వీ, ఖుషి.. ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు.. అక్కలాగే చెల్లి కూడా పెళ్లి గురించి ఏమందంటే..

After Janhvi Kapoor her Sister Khushi Kapoor Also talking about her Marriage Dreams

Updated On : January 27, 2025 / 3:01 PM IST

Janhvi – Khushi Kapoor  : శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఇటీవలే తెలుగులో దేవర సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల మీదే ఫోకస్ పెట్టిన జాన్వీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. తిరుమలలో పెళ్లి చేసుకొని నా భర్తతో కలిసి పెళ్లి తర్వాత తిరుపతిలో సెటిల్ అవ్వాలని, రోజూ అరిటాకులో తినాలని, రోజూ గోవిందా నామ స్మరణ వినాలని.. ఇలా తన పెళ్లి గురించి కన్న కలలు చెప్పింది. బాలీవుడ్ అమ్మాయి తిరుపతిలో భర్తతో సింపుల్ గా సెటిల్ అవుదాం అనుకోవడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే శ్రీదేవి వల్ల జాన్వీకి తిరుమలతో మంచి అనుబంధం ఏరపడింది. ప్రతి సంవత్సరం జాన్వీ కనీసం రెండు సార్లు తిరుమలకు వెళ్తుంది.

Also Read : Allu Arjun : బాల‌య్య‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శుభాకాంక్ష‌లు.. ‘నా హృద‌యం సంతోషంతో..’

జాన్వీ లాంటి బాలీవుడ్ అమ్మాయి ఇవన్నీ చెప్తే కొత్తగా ఉన్నాయి అనుకుంటే జాన్వీ చెల్లి, శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా అక్కలాగే ఆలోచిస్తుంది. ఖుషి కపూర్ కూడా ది ఆర్చీస్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. త్వరలో లవ్ యాపా అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఖుషి కపూర్ తన పెళ్లి గురించి మాట్లాడింది. జాన్వీ ఇలా చెప్పింది మరి నీ సంగతి ఏంటి అని అడగ్గా.. నాకు కూడా పెళ్లి పై చాలా నమ్మకం ఉంది. పెళ్ళిళ్ళల్లో బాగా ఎంజాయ్ చేస్తాను. అందుకే అందరి పెళ్లిళ్లకు వెళ్తాను. నేను కూడా చిన్నప్పట్నుంచి పెళ్లి గ్రాండ్ గా తిరుపతిలోనే చేసుకోవాలని కలలు కన్నాను. నేను, నా భర్త, ఇద్దరు పిల్లలు, నా పెంపుడు కుక్కలు, మా నాన్నతో కలిసి హ్యాపీగా జీవించాలి అని చెప్పింది.

Also Read : Kannappa : క‌న్న‌ప్ప నుంచి ప్ర‌భాస్ లుక్ వ‌చ్చేది అప్పుడే.. కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌..

ఖుషి కూడా అక్కలాగే తిరుపతి సెంటిమెంట్ చెప్పడంతో ఓ పక్క ఆశ్చర్యపోతూనే మరో పక్క అభినందిస్తున్నారు. శ్రీదేవి బాలీవుడ్ కి షిఫ్ట్ అయినా తన కూతుళ్లను సౌత్ ట్రెడిషన్స్ తోనే పెంచింది. జాన్వీకి తన తల్లి వల్ల టాలీవుడ్ అంటే చాలా ఇష్టం అని, చెన్నై అంటే ఇంకా ఇష్టం అని అనేక సార్లు చెప్పింది. దేవరతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన RC16 సినిమా చేస్తుంది. ఇక ఖుషి కపూర్ ప్రస్తుతానికి బాలీవుడ్ లోనే చేస్తుంది. తెలుగులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.