Mammootty : మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం.. తల్లి దూరమైన కొన్నాళ్లకే..

మమ్ముట్టి తల్లి మరణించిన బాధ నుంచి తేరుకోకముందే ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది.

Mammootty : మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం.. తల్లి దూరమైన కొన్నాళ్లకే..

Mammootty Sister Ameena Passed away at the age of 70

Updated On : September 12, 2023 / 2:57 PM IST

Mammootty :  ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి 72 ఏళ్ళ వయసులో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే కొన్ని నెలల క్రితం మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ 93 ఏళ్ళ వయసులో మరణించారు. దీంతో మమ్ముట్టి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

మమ్ముట్టి తల్లి మరణించిన బాధ నుంచి తేరుకోకముందే ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. మమ్ముట్టి సోదరి అమీనా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఇవాళ ఉదయం అమీనా కన్నుమూశారు. 70 ఏళ్ళ వయసులో ఆవిడ మరణించారు. దీంతో మరోసారి మమ్ముట్టి కుటుంబం విషాదంలో మునిగింది.

O Saathiya : 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్‌తో.. అమెజాన్‌లో దూసుకుపోతున్న ‘ఓ సాథియా’

పలువురు మలయాళ ప్రముఖులు మమ్ముట్టి సోదరికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. తల్లి మరణించిన కొన్నాళ్లకే సోదరి కూడా మరణించడంతో మమ్ముట్టి తీవ్ర విషాదంలో ఉన్నారు.