Manchu Manoj: భూమా మౌనికా రెడ్డి ప్రెగ్నెంట్.. గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్..

దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారంటూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు మంచు మనోజ్.

Manchu Manoj: భూమా మౌనికా రెడ్డి ప్రెగ్నెంట్.. గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్..

Manchu Manoj And Mounika Reddy

Updated On : December 16, 2023 / 8:40 PM IST

Bhuma Mounika Reddy: సినీ హీరో మంచు మనోజ్ శుభవార్త చెప్పారు. తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయినట్లు తెలిపారు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారంటూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు మంచు మనోజ్.

తన అత్తమ్మ భూమా పుట్టినరోజు వేళ ఆమెను గుర్తుచేసుకుంటూ ఈ శుభవార్త చెబుతున్నానని పేర్కొన్నారు మనోజ్. తన అత్తమ్మ శోభా నాగిరెడ్డి, మావయ్య భూమా నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారని అన్నారు.

అలాగే, అన్నయ్యగా తనకు ప్రమోషన్ వస్తున్నందుకు భూమా మౌనికా రెడ్డి కుమారుడు ధైరవ్ చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పారు. తన అత్తమ్మ, మావయ్య ఎక్కడున్నా తమను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. అలాగే, తన తల్లి నిర్మల, తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని చెప్పారు మంచు మనోజ్.

మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చిన్న కూతురే భూమా మౌనికా రెడ్డి అన్న విషయం తెలిసిందే. భూమా మౌనికా రెడ్డి, మంచు మనోజ్ వివాహం ఈ ఏడాది మార్చిలో జరిగింది.

 

View this post on Instagram

 

A post shared by Manoj Manchu (@manojkmanchu)

Suma Kanakala : ఆ షో కోసం యాంకర్ కట్టుకున్న చీరలు ఎన్నో తెలిస్తే షాకవుతారు