Manchu Manoj : ఈ పోస్ట్‌తో మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడా?

గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో మంచు ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ గురించి చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని, ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా మనోజ్ చేసిన ట్వీట్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్లే ఉంది.

Manchu Manoj : ఈ పోస్ట్‌తో మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడా?

Manchu Manoj has given clarity about marriage with bhuma mounika reddy?

Updated On : January 8, 2023 / 2:01 PM IST

Manchu Manoj : గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో మంచు ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ గురించి చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని, ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక గత ఏడాది వినాయక చవితి సమయంలో మనోజ్, మౌనిక కలిసి పూజలు నిర్వహించడంతో.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కథనాలు వచ్చాయి.

Manchu Manoj : త్వరలోనే కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నా.. మంచు మనోజ్!

ఇటీవల కడప దర్గాకి వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘త్వరలో కొత్త జీవితం మొదలు పెడుతున్నా, ఈసారి ఇక్కడికి కుటుంబంతో వస్తా’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో పెళ్లి అనే కథనాలకు ఈ మాటలు మరెంత బలాన్ని ఇచ్చాయి. తాజాగా మనోజ్ చేసిన ట్వీట్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్లే ఉంది. నేడు మౌనిక రెడ్డి తండ్రి స్వర్గీయ భూమా నాగిరెడ్డి జన్మదినం కావడంతో, మనోజ్ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు.

‘ఆయన ఒక గొప్ప లీడర్ మాత్రమే కాదు.. ఒక గొప్ప కొడుకు, భర్త, తండ్రి అంతకుమించి ఒక గొప్ప మనుసు ఉన్న వ్యక్తి. ఆయనే భూమా నాగిరెడ్డి గారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన అశీసులు మాత్రం ఎప్పుడు మనపైనే ఉంటాయి’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో, త్వరలోనే మనోజ్, మౌనిక రెడ్డితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ అభిప్రాయ పడుతున్నారు నెటిజెన్లు. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. గతంలో వీరిద్దరికి పెళ్లి అయ్యి విడాకుల తీసుకున్నారు. ఇక గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్.. ఇటీవలే ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాని ప్రకటించాడు. త్వరలోనే ఇది పట్టాలు ఎక్కనుంది.