Manchu Manoj : త్వరలోనే కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నా.. మంచు మనోజ్!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ శుక్రవారం కడప దర్గాని దర్శించుకున్నాడు. ఇప్పటివరకు 25 సినిమాల్లో నటించిన ఈ హీరో.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా కడప దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన మనోజ్, ఆ తరువాత మీడియా విలేకర్లతో మాట్లాడాడు.

Manchu Manoj : త్వరలోనే కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నా.. మంచు మనోజ్!

Manchu Manoj visits kadapa darga

Updated On : December 17, 2022 / 1:07 PM IST

Manchu Manoj : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ శుక్రవారం కడప దర్గాని దర్శించుకున్నాడు. ఇప్పటివరకు 25 సినిమాల్లో నటించిన ఈ హీరో.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. చివరిగా మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ అనే వార్ డ్రామా సినిమాతో 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తరువాత రెండు సినిమాలో అతిధి పాత్రలో కనిపించి అలరించాడు. దీంతో ఈ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పశాడు అనుకున్నారు.

Manchu Lakshmi : శ్రీకాకుళంలో మంచు లక్ష్మి.. ప్రభుత్వ పాఠశాలల్లో ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’

అయితే ఇటీవలే ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని ప్రకటించి తాను సినిమాలకు దూరం కాలేదని తెలియజేశాడు. తాజాగా కడప దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన మనోజ్, ఆ తరువాత మీడియా విలేకర్లతో మాట్లాడాడు. “ఎప్పటినుండో కడప దర్గాకి రావాలని అనుకుంటున్నా, కానీ ఇప్పటికి కుదిరింది. అలాగే సినిమాకి దూరంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ లు, కొత్త సినిమాలు మొదలు పెడుతున్నాను. ముఖ్యంగా ఒక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. ఈసారి ఇక్కడికి వచ్చేటప్పుడు కుటుంబంతో వస్తా” అంటూ వెల్లడించాడు.

కాగా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి కొంత కాలంగా సహజీవినం చేస్తున్నారు అంటూ వార్తలు వినిపించగా.. ఈమధ్య కలంలో వారిద్దరూ కూడా బయట చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. దీంతో మంచు, భూమా ఫ్యామిలీలు వీరిద్దరి పెళ్లితో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మనోజ్ మాటలతో అది నిజమని తెలుస్తుంది. అయితే గతంలో వీరిద్దరికి పెళ్లి అయ్యి విడాకుల తీసుకోగా, ఇది రెండో పెళ్లి.