Manchu Manoj : కుంటుకుంటూ హాస్పిటల్ కి వచ్చిన మంచు మనోజ్.. మోహన్ బాబు దాడి..?

తాజాగా మంచు మనోజ్ కుంటుకుంటూ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి చికిత్స కోసం వచ్చాడు.

Manchu Manoj : కుంటుకుంటూ హాస్పిటల్ కి వచ్చిన మంచు మనోజ్.. మోహన్ బాబు దాడి..?

Manchu Manoj Went to Hospital with Injuries along with Wife Videos goes Viral

Updated On : December 8, 2024 / 5:07 PM IST

Manchu Manoj : నేడు ఉదయం మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్యపై దాడి చేసారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. మోహన్ బాబు కూడా కూడా మనోజ్ పై ఫిర్యాదు చేసారని సమాచారం. స్కూల్, ఆస్తుల వ్యవహారంలోనే వీరి మధ్య గొడవలు వచ్చి మోహన్ బాబు వేరే వాళ్ళతో మనోజ్ ని కొట్టించారని సమాచారం. దీనిపై ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ బయటకు వచ్చి ఇప్పటిదాకా మాట్లాడలేదు.

Also Read : Mohan Babu – Manchu Manoj : నాపై, నా భార్యపై దాడి చేసారు.. తండ్రి మోహన్ బాబుపై మంచు మనోజ్ ఫిర్యాదు.. నిజమేనా?

అయితే తాజాగా మంచు మనోజ్ కుంటుకుంటూ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి చికిత్స కోసం వచ్చాడు. దీంతో ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం హాస్పటల్లో మంచు మనోజ్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. మంచు మనోజ్ తో పాటు అతని భార్య మౌనిక కూడా ఈ వీడియోలలో ఉంది. దీంతో ఈ వీడియోలు వైరల్ అవ్వగా మోహన్ బాబు మనోజ్ పై దాడి చేసింది నిజమే అని అంటున్నారు. దీనిపై మనోజ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడేమో చూడాలి.