Mohan Babu – Manchu Manoj : నాపై, నా భార్యపై దాడి చేసారు.. తండ్రి మోహన్ బాబుపై మంచు మనోజ్ ఫిర్యాదు.. నిజమేనా?

తాజాగా మోహన బాబు - మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం టాలీవుడ్ లో చర్చగా మారింది.

Mohan Babu – Manchu Manoj : నాపై, నా భార్యపై దాడి చేసారు.. తండ్రి మోహన్ బాబుపై మంచు మనోజ్ ఫిర్యాదు.. నిజమేనా?

Mohan Babu and Manchu Manoj filed cases in Film Nagar Policee Station

Updated On : December 8, 2024 / 12:12 PM IST

Mohan Babu – Manchu Manoj : గత కొంతకాలంగా మోహన్ బాబు ఫ్యామిలిలో తగాదాలు వస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ కి, మోహన్ బాబు కుటుంబానికి పడట్లేదని తెలుస్తుంది. గతంలో కూడా మంచు మనోజ్ – మంచు విష్ణు మధ్య గొడవలు జరిగాయని ఓ వీడియో కూడా వైరల్ అయింది. తాజాగా మోహన్ బాబు – మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం టాలీవుడ్ లో చర్చగా మారింది.

Also Read : Tirupati Prakash : ఒకప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడు అవకాశాల కోసం వెళ్తే ఫోటోలు పంపమని.. డైరెక్టర్ ఉన్నా లేరని చెప్పి..

మంచు మనోజ్.. తనని తన తండ్రి మోహన్ బాబు కొట్టాడని, తన భార్యపై కూడా దాడి చేసారని గాయాలతోనే పోలీస్ స్టేషన్ కి వచ్చి పహాడి షరీప్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. మనోజ్ కూడా తనపై దాడి చేసాడని మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. స్కూల్, ఆస్తుల వ్యవహారంలోనే వీరి మధ్య గొడవలు వచ్చాయని సమాచారం. ఇలా ఆస్తుల గొడవలతో, ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో మంచు కుటుంబం టాలీవుడ్ లో చర్చగా మారింది. అయితే దీనిపై ఆ ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ బయటకు వచ్చి ఇప్పటిదాకా మాట్లాడలేదు.

అయితే ఇది అసత్య ప్రచారం అని, ఎవరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లలేదని పలువురు మంచు ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. అయితే 100 కి కాల్ చేసి కంప్లైంట్ చేసారని కూడా పలువురు అంటున్నారు. దీనిపై మంచు ఫ్యామిలీ అధికారికంగా స్పందిస్తే తప్ప వీటికి క్లారిటీ లేదు.