KCR – Double Ismart : డబల్ ఇస్మార్ట్ – కేసీఆర్ వివాదం.. అందుకే కేసీఆర్ డైలాగ్ తీసుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన మణిశర్మ..

డబల్ ఇస్మార్ట్ మార్ ముంత చోడ్ చింత సాంగ్ లో కేసీఆర్ పాపులర్ డైలాగ్ 'ఏం చేద్దామంటావ్' అని కేసీఆర్ వాయిస్ తోనే వాడారు.

KCR – Double Ismart : డబల్ ఇస్మార్ట్ – కేసీఆర్ వివాదం.. అందుకే కేసీఆర్ డైలాగ్ తీసుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన మణిశర్మ..

Manisharma Gives Clarity about KCR Dialogue in Double Ismart Movie song

Updated On : July 27, 2024 / 7:55 AM IST

KCR – Double Ismart : పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు వచ్చి మెప్పించాయి. ఆగస్టు 15న డబల్ ఇస్మార్ట్ సినిమా రాబోతుంది. అయితే ఇటీవల ‘మార్ ముంత చోడ్ చింత..’ అనే పాట రిలీజయి బాగా వైరల్ అయింది.

ఈ మార్ ముంత చోడ్ చింత సాంగ్ లో కేసీఆర్ పాపులర్ డైలాగ్ ‘ఏం చేద్దామంటావ్’ అని కేసీఆర్ వాయిస్ తోనే వాడారు. గతంలో ఓ ప్రెస్ మీట్ లో కేసీఆర్ ‘ఏం చేద్దామంటావ్’ అని అన్న డైలాగ్ బాగా వైరల్ అయింది. ఈ డైలాగ్ ని అలాగే తీసుకొచ్చి తమ పాటలో పెట్టుకున్నారు. అయితే ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ డైలాగ్ పెట్టి అవమానించారని, పాటలో ఆ డైలాగ్ తీసేయాలని విమర్శలు చేసారు. పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చారు.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో తెలుసా? ఇప్పుడు ఇద్దరూ హీరోలే..

తాజాగా ఈ వివాదం పై సంగీత దర్శకుడు మణిశర్మ స్పందించాడు. మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. అందరూ కేసీఆర్ కు అభిమానులే. ఆయన డైలాగ్ పాటలో పెట్టాలని అందరం అనుకొనే పెట్టాము, అదేమీ ఐటెం సాంగ్ కాదు. కేసీఆర్ స్పీచ్ లు, డైలాగ్స్ చాలా వైరల్ అయ్యాయి. ఆయన్ని గుర్తుంచుకోడానికి పాటలో ఆయన డైలాగ్ పెట్టాము. ఈ పాట రాసిన కాసర్ల శ్యామ్, రాహుల్ సిప్లిగంజ్ కి కూడా కేసీఆర్ డైలాగ్ నచ్చింది. వాళ్ళు కూడా కేసీఆర్ కి, ఆయన స్పీచ్ కి అభిమానులే. పాటని ఎంజాయ్ చేయండి అంతే కానీ నెగిటివ్ గా తీసుకోకండి అని అన్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఏమంటారో చూడాలి.