Manjusha Mukkavilli : ఇన్స్టాగ్రామ్ రీల్స్ టు సమంత ఫ్రెండ్.. ‘మా ఇంటి బంగారం’లో కామెడీతో మెప్పించిన ఈమె ఎవరో తెలుసా?
సమంత మా ఇంటి బంగారం సినిమాలో సమంత ఫ్రెండ్ పాత్రలో నటించిన నటి పేరు మంజూష ముక్కవిల్లి. (Manjusha Mukkavilli)

ఇన్స్టాగ్రామ్ రీల్స్ టు సమంత ఫ్రెండ్.. 'మా ఇంటి బంగారం'లో కామెడీతో మెప్పించిన ఈమె ఎవరో తెలుసా?

సమంత మా ఇంటి బంగారం సినిమాలో సమంత ఫ్రెండ్ పాత్రలో నటించిన నటి పేరు మంజూష ముక్కవిల్లి. ఆమెకు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం.

ఈ సినిమాలో సమంత ఫ్రెండ్ గా ఆల్మోస్ట్ సినిమా అంతా ఉంటుంది మంజూష. తన కామెడీతో, సీరియస్ పరిస్థితుల్లో కూడా తన టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించింది మంజూష ముక్కవిల్లి. క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ భార్యగా నవ్వించి ఈమెతోనే సినిమాని ఎండ్ చేసారు.

మంజూష ముక్కవిల్లి ఈ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయింది. దీంతో ఈమె ఎవరా అని ఆరా తీస్తున్నారు.

మంజూష ముక్కవిల్లి అమెరికాలో నివసిస్తున్న తెలుగు మహిళ. ఇన్స్టాగ్రామ్ లో ఒకప్పటి నటీమణులను అనుకరిస్తూ వారిలా రెడీ అయి వీడియోలు చేసి ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఛాయాదేవి, నిర్మలమ్మ, సూర్యకాంతం ఇమిటేషన్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది.

ఈ వీడియోలు చూసిన నందిని రెడ్డి మూడు సార్లు ఆడిషన్ చేసి మంజూష ముక్కవిల్లిని మా ఇంటి బంగారం సినిమాలో సమంత ఫ్రెండ్ పాత్రకి సెలెక్ట్ చేసింది. దీంతో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి నటించింది మంజూష.

ఈ సినిమాలో మంజూష చెప్పే లెట్స్ కమాన్ అనే డైలాగ్ కూడా బాగా వైరల్ అవుతుంది.

Manjusha Mukkavilli
