మార్జావాన్ – ట్రైలర్
రితేష్ దేశ్ ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా, రకుల్ ప్రీత్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నలవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మార్జావాన్'.. ట్రైలర్ రిలీజ్..

రితేష్ దేశ్ ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా, రకుల్ ప్రీత్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నలవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మార్జావాన్’.. ట్రైలర్ రిలీజ్..
‘ఏక్ విలన్’ తర్వాత రితేష్ దేశ్ ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటిస్తున్న యాక్షన్ డ్రామా మూవీ.. ‘మార్జావాన్’.. తారా సుతారియా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏక్ విలన్ మూవీకి రైటర్‌గా పని చేసిన మిలాప్ జవేరి డైరెక్ట్ చేస్తుండగా, టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, దివ్యా కోశ్లా కుమార్, మోనీషా అద్వాణీ, మధు భోజ్వాణీ, నిఖిల్ అద్వాణీ నిర్మిస్తున్నారు.
రీసెంట్‌గా మార్జావాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. రితేష్ ఈ సినిమాలో మూడు అడుగుల ఎత్తు ఉండే మరుగుజ్జు విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తను ఎత్తుగా లేకపోయినా తన పగ ఎత్తెంతో చూపిస్తాడట రితేష్.. నా ఎత్తు గురించి కాదు.. నేను వేసే ఎత్తుల గురించి చూడండి అని సవాల్ విసిరేలా తన రోల్ ఉంటుందట.
Read Also : ‘నేర్కొండ పార్వై’ – 50 డేస్..
రితేష్, సిద్ధార్థ్‌ల మధ్య జరిగే సీన్స్ సినిమాకే హైలెట్ అని నిర్మాతలు చెప్పారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘మార్జావాన్’ నవంబర్ 8న విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : నిగమ్ బోమ్జాన్, ఎడిటింగ్ : మాహిర్ జవేరి.