Master Chef : తమన్నా వల్ల తడిసి మోపెడైందంట!

తమన్నా వల్ల కోట్లాది రూపాయలు నష్టపోయామంటూ వివరణ ఇచ్చారు ‘మాస్టర్ చెఫ్’ నిర్వాహకులు..

Master Chef : తమన్నా వల్ల తడిసి మోపెడైందంట!

Tamannaah

Updated On : October 27, 2021 / 6:40 PM IST

Master Chef: మిల్కీబ్యూటీ తమన్నా సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటుతూనే తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ ‘లెవంత్ అవర్’ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా హవా కొనసాగించింది. తీరా స్మాల్ స్క్రీన్ విషయానికొచ్చే సరికి సీన్ రివర్స్ అయ్యింది.

Unstoppable with NBK : మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..

తమన్నా కొద్దిరోజులుగా పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జెమిని టీవీలో ‘మాస్టర్ చెఫ్’ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ప్రోమోలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ.. ఎపిసోడ్స్ ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడం, పైగా టీఆర్‌పీ రేటింగ్స్ కూడా మరీ ఘోరంగా రావడంతో ఈ షో విమర్శలపాలైంది. దీంతో ఆమె ప్లేస్ ను స్టార్ యాంకర్ అనసూయతో రీప్లేస్ చేశారు. కట్ చేస్తే తనకివ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వలేందంటూ మిల్కీబ్యూటీ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Prabhas : ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటాన్రా?..

దీంతో తమన్నా వల్ల తాము నష్టపోయామంటూ షో నిర్వాహకులు అఫీషియల్‌గా లెటర్ రిలీజ్ చెయ్యడం చర్చనీయాంశంగా మారింది. ‘మాస్టర్ చెఫ్’ షో కోసం తమన్నాతో జూన్ 24 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు మొత్తం 18 రోజులకు గానూ 2 కోట్ల రూపాయలు ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నామని.. ఇతర పనుల వల్ల తమన్నా 16 రోజులు మాత్రమే షూటింగ్‌కి వచ్చిందని అంటున్నారు..

Bholaa Shankar : ‘ఆర్ఆర్ఆర్’ రోజునే ‘భోళా శంకర్’!

అంతేకాదు, మిగతా రెండు రోజులు తమన్నా రాకపోవడంతో దాదాపు 300 మంది టెక్నీషియన్స్ పని చేస్తున్న ఈ షో కు 5 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని.. ఇప్పటికే కోటి యాభై లక్షలు ఇచ్చామని, ఆ రెండు రోజులు కూడా వచ్చుంటే బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇచ్చేవారమని ‘మాస్టర్ చెఫ్’ నిర్వాహకులు తెలిపారు.

Evaru Meelo Koteeswarulu : మహేష్ ఎపిసోడ్‌‌కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..