Mega 154 New Schedule: మెగా 154.. బ్యాక్ టు సెట్స్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్‌ఫాదర్’, ‘భోళాశంకర్’లతో పాటు మరో సినిమా కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 154 ప్రాజెక్టు ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక చిరు ఈ సినిమాలో మరోసారి తన మాస్ స్వాగ్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు.

Mega 154 New Schedule: మెగా 154.. బ్యాక్ టు సెట్స్!

Mega 154 New Schedule Begins Shooting

Updated On : September 2, 2022 / 5:39 PM IST

Mega 154 New Schedule: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్‌ఫాదర్’, ‘భోళాశంకర్’లతో పాటు మరో సినిమా కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 154 ప్రాజెక్టు ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక చిరు ఈ సినిమాలో మరోసారి తన మాస్ స్వాగ్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు.

Mega 154: మెగా ట్రీట్ రెడీ చేస్తోన్న చిరు..?

అయితే ఈ సినిమా చిరు నటిస్తున్న ఇతర చిత్రాల్లో ప్రత్యేకం అని చెప్పాలి. గాడ్‌ఫాదర్, భోళాశంకర్ మూవీలు ఇతర భాషల రీమేక్ సినిమాలుగా వస్తుండగా, మెగా 154 మూవీ మాత్రం స్ట్రెయిట్ తెలుగు కథతో మనముందుకు తీసుకొస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినా, ఇంకా దీన్ని అఫీషియల్‌గా అనౌన్స్ మాత్రం చేయలేదు. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ మొదలుపెట్టారు.

Mega 154 : మెగా మాస్ కాంబో.. ఈసారి థియేటర్లు బద్దలవ్వాల్సిందే..

లెంగ్తీ షెడ్యూల్‌గా సాగనున్న ఈ చిత్ర షూటింగ్‌లో చిరు కూడా జాయిన్ అయ్యారు. నేటి నుంచి కొన్ని రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని, ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అటు త్వరలోనే మాస్ రాజా రవితేజ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవుతారని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.