Mega 154: మెగా ట్రీట్ రెడీ చేస్తోన్న చిరు..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రాజెక్టుల్లో ‘మెగా 154’ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి మెగా ట్రీట్‌ను మెగాస్టార్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌ను మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యిందట.

Mega 154: మెగా ట్రీట్ రెడీ చేస్తోన్న చిరు..?

Mega 154: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రాజెక్టుల్లో ‘మెగా 154’ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.

Mega154: చిరు, రవితేజలను కలిపేది ఆమేనా..?

ఈ సినిమా నుండి ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా అఫీషియల్‌గా రాకపోవడంతో అభిమానులు ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయనున్నట్లు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్త వినిపిస్తోంది. అయితే ఈ సినిమా నుండి మెగా ట్రీట్‌ను మెగాస్టార్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌ను మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యిందట.

Mega154: మెగాస్టార్‌తో మాస్ చిందులు.. ఆ తరువాతే యాక్షన్..?

మెగా అభిమానులకు ఆగస్టు 22న ఈ మెగా ట్రీట్‌తో పాటు మరికొన్ని స్పెషల్ ట్రీట్స్ కూడా ఉండబోతున్నట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మెగా 154 చిత్రంలో మెగాస్టార్ ఊరమాస్ అవతారంలో మరోసారి రెచ్చిపోయి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో రవితేజతో చిరు కలిసి చేసే సీన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.