HBD Chiranjeevi: తిరుమలలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం బస
ఈ సారి చిరు తన అభిమానులకు దూరంగా కుటుంబ సభ్యులతోనే తిరుమలలో జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి గురువారం జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. చిరంజీవికి స్వాగతం పలికి బస ఏర్పాటు చేశారు టీటీడీ రిసెప్షన్ అధికారులు.
ఫీనిక్స్ అతిథి గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి బస చేసిన చేస్తున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకోనున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును మెగా ఫ్యాన్స్ ఓ పండగలా జరుపుకుంటారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో చిరంజీవి 1955, ఆగస్ట్ 22న జన్మించారు. ఈ సారి చిరు తన అభిమానులకు దూరంగా కుటుంబ సభ్యులతోనే తిరుమలలో జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమల చేరుకున్నారు.
మరోవైపు, చిరు బర్త్‌డే సందర్భంగా 100 దేశాల మెగా ఫ్యాన్స్ బుధవారం జూమ్ లైవ్‌లో కనపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి అర్ధరాత్రి 12 వరకు లైవ్ మారథాన్‌లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు మొదలయ్యాయి. సీడీపీని మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు.
The most special day of the year is just hours away,
And I’m extremely happy to launch the CDP of our beloved Megastar @KChiruTweets garu ❤️His timeless legacy fuels our inspiration!#HBDMegastarChiranjeevi pic.twitter.com/Z5RwmDN5Nf
— Varun Tej Konidela (@IAmVarunTej) August 21, 2024
Also Read: ‘అన్‌స్టాపబుల్’ వేదికగా బాలకృష్ణ, చిరంజీవి మల్టీస్టారర్ మూవీ అనౌన్స్?