చేప పిల్లకి ఈత నేర్పాలా? చరణ్ బర్త్‌డే – చిరు ఎమోషనల్ పోస్ట్..

  • Published By: sekhar ,Published On : March 27, 2020 / 10:09 AM IST
చేప పిల్లకి ఈత నేర్పాలా? చరణ్ బర్త్‌డే – చిరు ఎమోషనల్ పోస్ట్..

Updated On : March 27, 2020 / 10:09 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మార్చి 27న తన 34వ పుట్టినరోజుని జరుపుకుంటున్న రామ్ చరణ్‌కు ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విషెస్ తెలిపారు. చిన్నప్పటి చరణ్‌ని తాను ఎత్తుకుని ఉన్న ఫోటోని షేర్ చేసిన మెగాస్టార్, అందరి తండ్రుల వలే తనకు కూడా చరణ్ పుట్టినపుడు ఎంతో సంతోషం కలిగిందని, అయితే సరిగ్గా మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజునే చరణ్ ఎందుకు పుట్టాడో తనకు ఆ తరువాతనే అర్ధం అయిందని.. 

Read Also : ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న, మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు..

చేప పిల్లకు ఈత నేర్పవలసిన అవసరం లేకుండా తన అనంతరం చరణ్ కూడా యాక్టింగ్‌లో అదరగొడుతున్నాడని గుర్తుచేసుకుంటూ రామ్ చరణ్‌కు విషెస్ తెలిపారు మెగాస్టార్. ఇక మెగాస్టార్ పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారికతో సహా పలువురు మెగా కుటుంబ సభ్యులు చెర్రీ అరుదైన ఫోటోలు షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27 సాయంత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుండి సరికొత్త అప్‌డేట్ రానుంది.