సాయి తేజ్ పెళ్లి.. కన్ఫామ్ చేసిన చిరు!..

  • Published By: sekhar ,Published On : October 15, 2020 / 01:03 PM IST
సాయి తేజ్ పెళ్లి.. కన్ఫామ్ చేసిన చిరు!..

Updated On : October 15, 2020 / 1:20 PM IST

Sai Dharam Tej: మెగా మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి ధరమ్ తేజ్ కథల ఎంపిక విషయంలో సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ, నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ సుప్రీం హీరోగా ఎదిగాడు. నేడు (అక్టోబర్ 15) సాయి తేజ్ పుట్టినరోజు.


ఈ సందర్భంగా అతను నటిస్తున్న ‘‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలోని ‘అమృత’ పాటను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే ప్రియమైన సాయితేజ్. ‘సోలో’ గా ఉన్నప్పుడే ఫుల్‌గా ఎంజాయ్ చెయ్. నీ బ్యాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులే’’ అంటూ చిరు ట్వీట్ చేశారు.
Sai Dharam Tejకాగా సాయి తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరు నీ బ్యాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులే అంటూ ట్వీట్ చేయడం చూస్తుంటే తేజ్ పెళ్లి వార్తలు నిజమే అనిపిస్తోంది. తేజ్ నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా, నభా నటేష్ కథానాయికగానటిస్తోంది. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.