Acharya Special Song: ఊపుమీదున్న మెగాస్టార్.. ఏమాత్రం తగ్గని గ్రేస్!
బాసు.. అడగకుండానే చూపిస్తున్నారు గ్రేసు. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన డ్యాన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. సీనియర్ హీరో అయినా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గని గ్రేస్ తో..

Acharya Special Song
Acharya Special Song: బాసు.. అడగకుండానే చూపిస్తున్నారు గ్రేసు. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన డ్యాన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. సీనియర్ హీరో అయినా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గని గ్రేస్ తో, ఇంకా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా యంగ్ హీరోయిన్లతో చానా కష్టం అంటూ చిందులేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాంచి ఊపు మీదున్నారు. లేట్ అయినా లేటెస్ట్ సాంగ్స్ తో సర్ ప్రైజ్ చేస్తున్నారు ఆచార్య. చిరంజీవి, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన చానాకష్టం పాట.. మెగాస్టార్ గ్రేస్ ని మరోసారి ప్రూవ్ చేసింది.
Daniel Craig: జేమ్స్ బాండ్‌కి బుద్దుందా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించి రెజీనా స్పెషల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. హుక్ స్టెప్స్ తో రెజీనా సరసన చిరంజీవి క్రేజీ స్టెప్పులు చూస్తే.. బాసులో గ్రేస్ ఏమాత్రం తగ్గినట్టు కనిపించడం లేదని అభిమానులు సంతోష పడిపోతున్నారు. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా.. మెగాస్టార్ స్టెప్పులు ఫాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఖైదీ నెం.150లో కూడా స్పెషల్ సాంగ్ తో అదరగొట్టిన చిరంజీవి.. ఇప్పుడు కూడా ఆచార్యలో అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు.
Siri-Shanmukh: బాధలో దీప్తి.. జెస్సీ, సిరితో షన్ను ఎంజాయ్‌మెంట్!
యంగ్ హీరోయిన్ తోపోటీపడుతూ.. అదే ఎనర్జీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రిలీజ్ అయిన లాహే లాహే పాటలో స్టెప్పులతో అలరించిన చిరు.. లేటెస్ట్ గా ఈ చానాకష్టం పాటతో యంగ్ హీరోల గ్రేస్ కి కూడాపోటీ ఇస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ల తెరకెక్కుతున్న ఆచార్య మూవీ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, వీడియోలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఈకోవిడ్ తో సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో అని డౌట్ పడుతున్న జనాలకు.. ఫిబ్రవరి 4నే రిలీజ్ అంటూ మరోసారి కన్ ఫామ్ చేసింది టీమ్.