Chiranjeevi : వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలి – చిరంజీవి హాట్ కామెంట్స్
క్రమశిక్షణ కు మారుపేరైన వెంకయ్య నాయుడు రాష్ట్రపతిస్థాయికి ఎదగాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Chiru
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ వ్యాఖ్యలు చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వెంకయ్య నాయుడు రాష్ట్రపతిస్థాయికి ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. 2021, నవంబర్ 17వ తేదీ అమీర్ పేటలో యోధ డయోగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృషి పట్టుదలతో ఉన్నత శిఖరాలకు ఎదిగారని కొనియాడారు.
క్రమశిక్షణ కు మారుపేరైన వెంకయ్య నాయుడు రాష్ట్రపతిస్థాయికి ఎదగాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. విశ్వనగరంగా పేరు సంపాదించిన హైదరాబాద్ లో హెల్త్ కేర్, ఫార్మా రంగంలో అభివృద్ధి చెందుతోందని, జీనోమ్ సీక్వెన్స్ పై అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్ లో వచ్చే వ్యాధులను గుర్తుంచుకోవాలన్నారు. కార్డియాక్ సమస్యపై ముందుగా అవగాహన లేకపోవడం వల్లే..నటుడు పునీత్ రాజ్ కుమార్ చనిపోయారని, అందరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిరంజీవి మరోసారి సూచించారు.
Read More : Koil Alwar Thirumanjanam : తిరుమలలో నవంబరు 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే సంవత్సరం జులై నాటికి పూర్తి కానున్న సంగతి తెలిసిందే. 2017లో భారత ప్రథమ పౌరుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో..చిరంజీవి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.