Koil Alwar Thirumanjanam : తిరుమలలో న‌వంబ‌రు 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో న‌వంబ‌రు 23వ తేదీ మంగ‌ళ‌వారం ఆలయంలో  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఏకాంతంగా నిర్వహించనున్నారు.

Koil Alwar Thirumanjanam : తిరుమలలో న‌వంబ‌రు 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

Koil Alwar Tirumanjanam

Updated On : November 17, 2021 / 6:17 PM IST

Koil Alwar Thirumanjanam :  తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో న‌వంబ‌రు 23వ తేదీ మంగ‌ళ‌వారం ఆలయంలో  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఏకాంతంగా నిర్వహించనున్నారు. ప్ర‌తి ఏడాది  బ్ర‌హ్మోత్స‌వాల ముందు వ‌చ్చే మంగ‌ళ‌వారం ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ.

ఇందులో భాగంగా  నవంబర్ 23  ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Also Read : Karthika Parva Deepotsavam : న‌వంబ‌రు 18న తిరుమలలో కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం