Vishwambhara : ఇండస్ట్రీ హిట్ కొట్టిన మెగాస్టార్ సినిమా రిలీజ్ రోజే.. ‘విశ్వంభర’ రిలీజ్ కూడా?

తాజాగా విశ్వంభర మూవీ రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్‌ చర్చ జరుగుతుంది.

Vishwambhara : ఇండస్ట్రీ హిట్ కొట్టిన మెగాస్టార్ సినిమా రిలీజ్ రోజే.. ‘విశ్వంభర’ రిలీజ్ కూడా?

Megastar Chiranjeevi Vishwambhara Movie Release Date Rumors Goes Viral

Updated On : January 25, 2025 / 8:42 PM IST

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వస్తున్న విశ్వంభర సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందకు రాబోతుంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ గేమ్‌ఛేంజర్ రేసులో ఉండటంతో వాయిదా వేశారు. అలాగే విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ కూడా కొంత పెండింగ్‌లో ఉండటం, ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్‌పై ఫ్యాన్స్ పెదవి విరవడంతో కాస్త టైమ్ తీసుకుని అయినా సరే మంచి విజువల్స్ ఎఫెక్స్ట్‌తో తీర్చిదిద్దుతున్నారు. అయితే తాజాగా విశ్వంభర మూవీ రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్‌ చర్చ జరుగుతుంది.

మే 9న విశ్వంభర మూవీని రిలీజ్‌ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్‌ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఆ డేట్ న రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మే 9నే విశ్వంభర కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం విశ్వంభర మూవీ షూట్‌ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్స్ జరుగుతుంది.

Also Read : Anil Ravipudi – Nani : వాట్.. ఆ సూపర్ హిట్ సినిమా క్లైమాక్స్ రాసింది అనిల్ రావిపూడినా? నాని, అనిల్ కలిసి ఏం చేశారంటే..

జగదేక వీరుడు వచ్చి దాదాపు 35 సంవత్సరాలు అవుతుండటంతో సెంటిమెంట్‌గా అదే రోజు విశ్వంభర మూవీని ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నారట. మరోసారి సోషియో ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో విశ్వంభరపై ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. మే 9న రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి మరి.

Also See : Keerthy Suresh : వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలను షేర్ చేసిన కీర్తి సురేష్.. భర్తతో మహానటి క్యూట్ ఫోటోలు చూశారా?

ఇటీవల వచ్చిన గ్లింప్స్ పై మాత్రం గ్రాఫిక్స్ బాగోలేవని విమర్శలు వచ్చాయి. దీంతో మూవీ యూనిట్ గ్రాఫిక్స్ పై మరింత వర్క్ చేస్తుంది. దీని కోసం ముందుగా ఒప్పందం చేసుకున్న గ్రాఫిక్స్ కంపెనీని కూడా మార్చేశారని సమాచారం. ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెళ్లుగా మరో 5 గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో పాటు సోషియో ఫాంటసీ కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి చివరగా భోళా శంకర్ సినిమాతో రాగా ఆ సినిమా పరాజయం పాలైంది. మరి విశ్వంభరతో వచ్చి మళ్ళీ జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి పెద్ద హిట్ కొడతాడేమో చూడాలి.