Merge Movie : సింధు మాతాజీ ఆశీస్సులతో.. ప్రారంభమైన ‘మెర్జ్’..

హైదరాబాద్ లోని శ్రీ భద్రకాళి పీఠంలో డా. సింధు మాతాజీ ఆశీస్సులతో ఈ 'Merge' సినిమా ఘనంగా ప్రారంభమైంది.

Merge Movie : సింధు మాతాజీ ఆశీస్సులతో.. ప్రారంభమైన ‘మెర్జ్’..

Merge Movie Started with Pooja Ceremony Under Sindhu Mathaji

Merge Movie : లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3గా రాజు గుడిగుంట్ల నిర్మాణంలో కొత్త దర్శకుడు బి. విక్రమ్ ప్రసాద్ దర్శకత్వంలో ‘మెర్జ్’ అనే సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్ లోని శ్రీ భద్రకాళి పీఠంలో డా. సింధు మాతాజీ ఆశీస్సులతో ఈ ‘Merge’ సినిమా ఘనంగా ప్రారంభమైంది.

Also Read : Thangalaan Trailer : ‘తంగ‌లాన్’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. విక్ర‌మ్ న‌ట‌న నెక్ట్స్ లెవల్‌..

ఈ సినిమాలో జబర్దస్త్ రాము, అంబటి శ్రీను, శక్తి చైతన్య ,పెరికల మాధురి, హరి తేజ, చంటి, దిలీప్, బాలరాజు.. పలువురు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. నేడు ఈ సినిమా పూజ కార్యక్రమాలతో మొదలైంది. అనంతరం నిర్మాత రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ జులై 15వ తేదీ నుంచి విజయవాడలో మొదలవుతుంది. సైన్స్ ఫిక్షన్ తరహాలో రొటీన్ కు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది అని తెలిపారు.

Merge Movie Started with Pooja Ceremony Under Sindhu Mathaji