IPL Today MI vs CSK : నువ్వా..నేనా? అమితుమీకి సిద్ధమైన ముంబై, చెన్నై.. ఎవరిది పైచేయి.. గత రికార్డులివే.. వారిద్దరివైపే అందరిచూపు
IPL Match Today MI vs CSK: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఇవాళ రాత్రి హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వర్సెస్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్లు వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి.
IPL 2026 MI vs CSK Match Today
- నేడు ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్
- హోంగ్రౌండ్లో ముంబై సత్తా చాటుతుందా
- అందరి చూపు ధోనీ, రోహిత్ వైపే
- ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు బరిలోకి దిగుతారా?
MI vs CSK Preview : ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఇవాళ రాత్రి హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వర్సెస్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్లు అమితుమీకి సిద్ధమవుతున్నాయి. ఇరు జట్లు 18ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పది సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ట్రోఫీలు గెలుచుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ సైతం ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. ఇరు జట్లలో బలమైన ఆటగాళ్లు ఉండటంతో వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ జరిగే మ్యాచ్ అభిమానులకు బిగ్ కిక్ ఇవ్వనుంది.
Also Read : గెలిచే మ్యాచ్ ఓడాం.. వాళ్లవల్లే ఇదంతా.. నా తప్పు కూడా ఉంది.. రిషబ్ పంత్ కీలక కామెంట్స్..
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ మ్యాచ్ లో అందరి కళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలపైనే ఉన్నాయి. ధోనీ ఇప్పటి వరకు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ తుది జట్టులో ఉండటం లేదు. చెన్నై జట్టు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో వెనుకబడుతున్న వేళ ఇవాళ జరిగే మ్యాచ్ కు ధోనీ ఎంట్రీ ఇస్తారని సీఎస్కే అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ముంబై జట్టులో రోహిత్ శర్మ గత రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్నారు. ఇవాళ చెన్నైతో జరిగే మ్యాచ్ లో తుదిజట్టులో చేరుతాడని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో చెన్నై, ముంబై జట్లు వెనుకబడి ఉన్నాయి. ముంబై జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడగా.. కేవలం రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. చెన్నై జట్టు ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే విజయం సాధించి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే, ముంబై రన్ రేటు (ప్లస్0.067)కాగా.. చెన్నై రన్ రేట్ (-0.780)గా ఉంది.
ఐపీఎల్ చరిత్రలో ముంబై – చెన్నై జట్లు 39సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై అత్యధికంగా 21 మ్యాచ్ లలో విజయం సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18మ్యాచ్ లలో విజయం సాధించింది. అయితే, ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి ఆరు మ్యాచ్లలో సీఎస్కేదే పైచేయి. చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్లలో గెలిస్తే, ముంబై ఇండియన్స్ కేవలం ఒక్కదాంట్లోనే విజయం సాధించింది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.
