మిస్ మ్యాచ్ ఫస్ట్ లుక్‌

డైరెక్టర్ క్రిష్ చేతుల మీదగా ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న 'మిస్ మ్యాచ్' ఫస్ట్ లుక్ విడుదల..

  • Published By: sekhar ,Published On : May 11, 2019 / 06:32 AM IST
మిస్ మ్యాచ్ ఫస్ట్ లుక్‌

Updated On : May 11, 2019 / 6:32 AM IST

డైరెక్టర్ క్రిష్ చేతుల మీదగా ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న ‘మిస్ మ్యాచ్’ ఫస్ట్ లుక్ విడుదల..

తమిళ్‌లో విజయ్ ఆంటోనీ హీరోగా డా.సలీమ్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఎన్.వి.నిర్మల్ కుమార్ తెలుగులో తెరకెక్కిస్తున్న సినిమా.. మిస్ మ్యాచ్.. ‘ఈజ్ ది రియల్ మ్యాచ్’ అనేది ట్యాగ్ లైన్.. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తుండగా, జి.శ్రీరామ్ రాజు, కె.భరత్ రామ్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేసారు. ప్రముఖ రచయిత భూపతిరాజా ఈ సినిమాకి కథనందించారు.

‘దర్శకుడు నిర్మల్ కుమార్ సినిమా తీసే విధానం డా.సలీమ్‌తోనే అర్థం అయ్యింది. మిస్ మ్యాచ్ టీమ్ అందరూ నాకూ పరిచయమే, సినిమా మంచి విజయం సాధించాలి’ అని క్రిష్ అన్నారు. త్వరలో విడుదల కానున్న మిస్ మ్యాచ్ సినిమాకి కెమెరా : గణేష్ చంద్ర, సంగీతం : గిఫ్టన్ ఇలియాస్, మాటలు : రాజేంద్ర కుమార్.