Puneeth Rajkumar: మిస్ యూ పునీత్.. అభిమానుల కన్నీటి రోదన!

ప్రముఖ కన్నడ నటుడు, పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్ను మూశారు.శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్.. జిమ్‌ లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో..

Puneeth Rajkumar: మిస్ యూ పునీత్.. అభిమానుల కన్నీటి రోదన!

Puneeth Rajkumar

Updated On : October 29, 2021 / 3:15 PM IST

Puneeth Rajkumar: ప్రముఖ కన్నడ నటుడు, పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్ను మూశారు.శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్.. జిమ్‌ లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తుండగా తుది శ్వాస విడిచారు. పునీత్ అస్వస్థత విషయం తెలియగానే అభిమానులు భారీగా హాస్పిటల్ వద్దకు చేరుకొని తమ అభిమాన హీరో, వారి ఆరాధ్య కథానాయకులు రాజ్ కుమార్ వారసుడు బ్రతకాలని వేడుకున్నారు.

Puneeth Rajkumar: పవర్ స్టార్ పునీత్ ఇక లేరు..!

కానీ.. విధి వంచించి పునీత్ ను తీసుకెళ్లింది. పునీత్ మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ వయసు 46 ఏళ్ళు కాగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు. కన్నడ పవర్ స్టార్ గా తనదైన మేనరిజంతో భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పునీత్.. అటు తండ్రి రాజ్ కుమార్ అభిమానులతో కూడా సాన్నిహిత్యంగా ఉంటూ లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చారు. వారసుడిగానే శాండల్ వుడ్ లో ప్రవేశించిన పునీత్ కొద్దికాలంలోనే ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత.. శోకసంద్రంలో శాండల్‌వుడ్..

పునీత్ అస్వస్థత వార్త తెలియగానే ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు తన అభిమాన నటుడు లేడన్న విషయం తెలియగానే కన్నీటి పర్యంతమయ్యారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరిన అభిమానులను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు. కన్నడ పరిశ్రమకి చెందిన సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొనే పరిస్థితి కూడా లేకపోవడంతో పోలీసులు భారీ బందోబస్తు కల్పించాల్సి వచ్చింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించింది.