Samantha Item Song : హిందువులకు దేవీ శ్రీ క్షమాపణలు చెప్పాలి..లేకపోతే తెలంగాణలో తిరగనివ్వం – రాజాసింగ్

ఐటం సాంగ్,. దేవుళ్ల పాటలు ఒక్కటే అనడం సరికాదన్నారు. వెంటనే హిందువులకు ఆయన క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు.

Samantha Item Song : హిందువులకు దేవీ శ్రీ క్షమాపణలు చెప్పాలి..లేకపోతే తెలంగాణలో తిరగనివ్వం – రాజాసింగ్

Mla Rajasingh

Updated On : December 18, 2021 / 11:47 AM IST

MLA Raja Singh Angry : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఫిల్మ్ లోని ఐటమ్ సాంగ్ పై వివాదం కంటిన్యూ అవుతోంది. సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు దేవీ శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఐటం సాంగ్,. దేవుళ్ల పాటలు ఒక్కటే అనడం సరికాదన్నారు. వెంటనే హిందువులకు ఆయన క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు.

Read More : Cyber Fraud Hyderabad : వ్యాలెట్‌‌లో ఉన్న రూ. 2 కోట్లను కొట్టేశారు

అసలు ఏం జరిగింది ?
అల్లు అర్జున్ నటించిన పుష్ప రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాలో ఐటం సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో సమంత నటించారు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ పాట బాగా వైరల్ అయింది. కానీ..పాటలో అభ్యంతరకరపదాలు ఉన్నాయని..వెంటనే వాటిని తొలగించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఈ పాట మీద కేసులు కూడా పెట్టారు.

Read More : Radheshyam : ‘రాధేశ్యామ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు వాళ్ళే…

తమిళనాడులో కూడా ఈ పాట మీద వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో సమంత, చంద్రబోస్ లను విమర్శిస్తూ మీమ్స్ పోస్టులు చేశారు. ఈ పాటపై కొన్ని పురుష సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిని తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. ‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేవి శ్రీ ప్రసాద్ ఈ ఐటెం సాంగ్ పై స్పందించారు. ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ సాంగ్సే అన్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.