‘మోసగాళ్లు’కు ట్రంప్‌కు సంబంధం ఏంటి?..

  • Published By: sekhar ,Published On : October 3, 2020 / 11:28 AM IST
‘మోసగాళ్లు’కు ట్రంప్‌కు సంబంధం ఏంటి?..

Updated On : October 3, 2020 / 11:37 AM IST

Mosagallu Teaser: మంచు విష్ణు హీరోగా నటిస్తూ.. AVA Entertainment, 24 Frames Factory Banners పై నిర్మిస్తున్న చిత్రం.. ‘మోసగాళ్లు’. ప్రపంచంలో అతి పెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. శనివారం ఈ సినిమా టీజర్‌ను స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ విడుదల చేశారు.


‘నా చిన్ననాటి స్నేహితుడు, స్కూల్‌మేట్‌ విష్ణు మంచుకి, ప్రియమైన కాజల్‌ అగర్వాల్‌కి, ఎంటైర్‌ యూనిట్‌కి అభినందనలు’.. అంటూ బన్నీ మూవీ యూనిట్‌కు విషెష్‌ తెలిపారు. టీజర్‌ చూస్తుంటే సినిమా అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో సాగేలా కనిపిస్తుంది.

మోసగాళ్లను పట్టుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటన చేయడం.. విష్ణు, కాజల్‌ భారీ మొత్తంలో డబ్బు సమకూర్చడం లాంటి సన్నివేశాలు టీజర్‌లో చూపించారు. కాజల్‌ అగర్వాల్‌ ఇందులో విష్ణు సోదరిగా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రుహీ సింగ్‌ హీరోయిన్‌.. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.