‘మదర్ ఇండియా’ నటి కుమ్‌కుమ్ కన్నుమూత..

  • Published By: sekhar ,Published On : July 28, 2020 / 05:22 PM IST
‘మదర్ ఇండియా’ నటి కుమ్‌కుమ్ కన్నుమూత..

Updated On : July 29, 2020 / 12:11 PM IST

బాలీవుడ్ అలనాటి నటి కుమ్‌కుమ్ కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కుమ్‌కుమ్ బాంద్రాలోని తన నివాసంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కుమ్‌కుమ్ అసలు పేరు జైబున్నీసా. బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలోని హుస్సైనాబాద్‌కు చెందిన కుమ్‌కుమ్ వందకు పైగా సినిమాల్లో నటించారు.



‘మదర్ ఇండియా, కోహినూర్, ఉజాలా, ఏక్ సపేరా ఏక్ లూటేరా, నయా దౌర్, రాజ్ అవుర్ రంక్, గీత్, అంఖే, లాల్కర్’ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే, మొట్టమొదటి భోజ్‌పురి సినిమా ‘గంగా మైయా తోహె పియారీ చదయాబో’లోనూ కుమ్‌కుమ్ నటించారు. ఆమె మృతితో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు ఆమె మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.Mother India