ప్రపంచంలో అతిపెద్ద పైరసీ .. ఇండస్ట్రీకి రూ.22వేల కోట్లు నష్టం చేసిన ముఠా అరెస్ట్..

హైదరాబాద్ నగరంలో భారీ మూవీ పైరసీ రింగ్‌ను పట్టుకున్నట్లు (Movie Piracy) నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేసినట్టు సమాచారం.

ప్రపంచంలో అతిపెద్ద పైరసీ .. ఇండస్ట్రీకి రూ.22వేల కోట్లు నష్టం చేసిన ముఠా అరెస్ట్..

Movie piracy gang arrested in Hyderabad

Updated On : September 29, 2025 / 12:16 PM IST

Movie Piracy: హైదరాబాద్ నగరంలో భారీ మూవీ పైరసీ రింగ్‌ను పట్టుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేసినట్టు సమాచారం. వారి వద్ద నుంచి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్కులు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లాంటి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక కమిషనర్ తెలిపిన వివరాల మేరకు.. నిందితులు ఇటీవల విడుదలైన తెలుగు, హిందీ, తమిళ సినిమాలను థియేటర్స్(Movie Piracy) లో రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని ఆన్‌లైన్ ద్వారా అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నారని, ఈ అమ్మకాల ద్వారా కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నారని తెలిపారు. ఈ ముఠా వల్ల సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్లు నష్టం వాటిళ్లినట్టు అంచనా వేస్తున్నారు.   దాదాపు వారం రోజులపాటు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టించి ఈ గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు వివరించారు.

Sasivadane Trailer: ప్రేమించాలని డిసైడ్ అయితే యుద్ధం చేయాల్సిందే.. ఆకట్టుకుంటున్న “శశివదనే” ట్రైలర్

ఇంకా ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను దెబ్బతీసే పైరసీ మాఫియాను ఉపేక్షించమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ప్రజలు కూడా పైరసీని ప్రోత్సహించకుండా కేవలం థియేటర్లలోనే సినిమాలు చూసి పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీస్ సిబ్బంది పనిచేశారని, వారికి కుతజ్ఞతలు తెలిపారు కమిషనర్.