తెలుగు హీరోలకి కలిసిరాని 2019 బిగినింగ్

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 05:11 AM IST
తెలుగు హీరోలకి కలిసిరాని 2019 బిగినింగ్

Updated On : April 2, 2019 / 5:11 AM IST

ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే హిట్టు సినిమాలతో ఆరంభం అదిరిపోతుంది అని ఆశపెట్టుకుంటే గడిచిన మూడు నెలలు.. ప్రేక్షకులకు చాలా బోర్ కొట్టించాయి. పెద్ద హీరోల సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు పోనీ రిలీజైన సినిమాలైనా ఆకట్టుకున్నాయా అంటే అదీ లేదు. క్వార్టర్లీ ఎగ్లామ్ లో.. టాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేయిల్ అయ్యింది. 2019 బిగెనింగ్.. తెలుగు హీరోలకి అస్సలు కలిసిరాలేదు. జనవరి 9న సంక్రాంతి కానుకగా భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఫిబ్రవరి 22న వచ్చిన సెకెండ్ పార్ట్ మహానాయకుడు టాలివుడ్ చరిత్రలోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది.

సంక్రాంతికే రిలీజైన రామ్ చరణ్ సినిమా.. వినయ విధేయ రామ కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుందని అంచనాలు పెట్టుకుంటే.. తీవ్రంగా నిరాశపర్చింది. దాదాపు 90 కోట్లతో సినిమా తీస్తే 60 కోట్లు మాత్రమే వసూల్ చేసింది. దీనికితోడు మితిమీరిన వయిలెన్స్ ప్రేక్షకుల్ని భయపెట్టేసింది. మూడో సినిమాతోనైనా హిట్టు కొడదామనుకున్న అక్కినేని అఖిల్ కి కూడా.. ఈ ఇయర్ బిగెనింగ్ కలిసిరాలేదు. వెంకీ అట్లూరి, అఖిల్ కాంబోలో వచ్చిన మిస్టర్ మజ్ను ప్లాప్ అయ్యింది. ఫిబ్రవరి 8న రిలీజైన యాత్ర కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది.

గడిచిన మూడు నెలల్లో తెలుగు ఆడియన్స్ ని..ఎంటర్టైన్ చేసిన సినిమా ఒక్క ఎఫ్ 2 మాత్రమే. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్ 2.. ఏకంగా వంద కోట్ల వసూళ్లు సాధించింది. మార్చిలో రిలీజైన కళ్యాణ్ రామ్ 118 కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. మార్చి 29న రిలీజైన లక్ష్మీస్ ఎన్టీఆర్ హిట్టు టాక్ ని సంపాదించుకుంది. ఇలా మూడు నెలల్లో 35 చిన్న, పెద్ద సినిమాలు రిలీజైతే మూడు సినిమాలు మాత్రమే ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.