Movie Releases: భీమ్లా ఎంట్రీ.. మేకర్స్ మధ్య మళ్ళీ రిలీజ్ కన్ఫ్యూజన్!

ప్రెజెంట్ పవన్ మేనియా టాలీవుడ్ ను కమ్మేసింది. ఫిబ్రవరి 25 ఫిక్స్ అనగానే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు కానీ.. ఆ డేట్ కి వస్తామన్న హీరోలకిప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.

Movie Releases: భీమ్లా ఎంట్రీ.. మేకర్స్ మధ్య మళ్ళీ రిలీజ్ కన్ఫ్యూజన్!

Movie Releases

Updated On : February 19, 2022 / 9:13 PM IST

Movie Releases: ప్రెజెంట్ పవన్ మేనియా టాలీవుడ్ ను కమ్మేసింది. ఫిబ్రవరి 25 ఫిక్స్ అనగానే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు కానీ.. ఆ డేట్ కి వస్తామన్న హీరోలకిప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. సైలెంట్ గా కొందరు వెనక్కి వెళ్లిపోతుంటే.. పవన్ తో తలపడలా వద్దా అని తలలు పట్టుకుంటున్నారు ఇంకొంతమంది. మొత్తానికి టాలీవుడ్ లో మళ్లీ ఉన్నట్టా లేనట్టా అన్న రిలీజ్ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది.

Adavallu Meeku Joharlu: వెనక్కి తగ్గిన శర్వానంద్.. కొత్త డేట్ ఎప్పుడంటే?

ఫిబ్రవరి 25 రిలీజ్ డేట్ ప్రకటించి రికార్డ్స్ సృష్టిస్తున్నాడు భీమ్లానాయక్. తెలుగు రాష్ట్రాలతో పాటూ యూఎస్ మార్కెట్ లోనూ పవన్ మేనియా పీక్స్ కు చేరుకుంది. దీంతో బాబాయ్ సినిమాతో ఎందుకొచ్చిన గొడవా అని అబ్బాయ్ వరుణ్ తేజ్ పోటీ వద్దనుకుంటున్నట్టు తెలుస్తోంది. రిస్క్ తీసుకోకుండా గనిని మరో డేట్ కు ఫిక్స్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగసలు వినిపిస్తున్నాయి. అందుకే ఎలాంటి ప్రమోషన్స్ హడావిడీ చూపించట్లేదు గని టీమ్.

bheemla Nayak Trailer: ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫిబ్రవరి 22నే భీమ్లా ట్రైలర్!

ముందు భీమ్లానాయక్ తో క్లాష్ కి సిద్ధపడినట్టే కనిపించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఫైనల్ గా వాయిదా వేసుకున్నారు. కిషోర్ తిరుమల కంటెంట్, శర్వా – రష్మిక కాంబోతో హిట్ గ్యారంటీ అనే నమ్మకాన్ని చూపిస్తూ.. కీర్తి సురేశ్-సాయి పల్లవి వంటి వారితో ఆడవాళ్లు ట్రైలర్ రిలీజ్ ను ప్లాన్ చేసి బరిలో దిగాలని అనుకున్నారు. కానీ.. ఏమైందో ఏమో ఎందుకొచ్చిన గొడవలే అని ఆడవాళ్లు కూడా పక్కకి తప్పుకున్నారు.

Bheemla Nayak: ఓటీటీల పోటీ.. రికార్డు ధర పలికిన భీమ్లా నాయక్!

కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ PC524 కూడా ఫిబ్రవరి 25కే వస్తామని ప్రకటించింది కానీ సడెన్ గా భీమ్లానాయక్ ట్రాక్ ఎక్కడంతో.. డ్రాప్ అవుతున్నట్టు తేల్చేశారు సెబాస్టియన్ మేకర్స్. భీమ్లానాయక్ వస్తే సెబాస్టియన్ ను తప్పిస్తామని ముందు చెప్పినట్టుగానే మార్చ్ 4కు వెళ్లిపోయాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా మార్చి5న రిలీజ్ అని ప్రకటించారు. బహుశా గని కూడా అదే సమయంలో ఒకరోజు ముందో వెనకో వచ్చేయనుంది. ఎందుకంటే మళ్ళీ భారీ సినిమా హవా ఉన్న నేపథ్యంలో మార్చి తొలి వారంలోనే మీడియం సినిమాలన్నీ రావాల్సి ఉంది. దీంతో ఇండస్ట్రీలో మళ్ళీ అదే కన్ఫ్యూజన్ కనిపిస్తుంది.