MP Kiran Kumar Reddy : ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి అల్లు అర్జున్ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాడు.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్..

తాజాగా గాంధీభవన్ లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ మాట్లాడుతూ..

MP Kiran Kumar Reddy : ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి అల్లు అర్జున్ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాడు.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్..

MP Chamala Kiran Kumar Reddy Sensational Comments on Allu Arjun and Opposition Party's

Updated On : December 23, 2024 / 5:38 PM IST

MP Chamala Kiran Kumar Reddy : సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నా తప్పేం లేదు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ మాట్లాడారు. దీంతో బన్నీ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో బన్నీపై పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

తాజాగా గాంధీభవన్ లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. సీఏం రేవంత్ కి అల్లు అర్జున్ పై, సినీ ఇండస్ట్రీపై కోపం లేదు. సినీ ఇండస్ట్రీకి, మాకు వైరం ఏముంటుంది? అల్లుఅర్జున్ కి, మాకు వైరం ఎందుకు ఉంటుంది?. బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లే ఇలా జరిగింది. సినిమా హాల్ కి హీరో, హిరోయిన్ రావడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. హ్యూమిలేట్ చేస్తున్నారని అల్లు అర్జున్ చెప్పడం తప్పు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి అల్లు అర్జున్ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాడు అని అన్నారు.

Also Read : Pushpa 2 Producers : హాస్పిటల్ లో శ్రీ తేజను పరామర్శించిన పుష్ప నిర్మాతలు.. 50 లక్షల చెక్కు ఆ కుటుంబానికి ఇచ్చి..

ఈ విషయంలో ప్రతిపక్షాలపై ఫైర్ అవుతూ.. ఒక మహిళ ప్రాణాలు పోతే ప్రతిపక్షాలకి బాధ్యత ఉండదా? అల్లు అర్జున్ ఇంటిపై ఎవరో దాడి చేస్తే వాళ్లు కాంగ్రెస్ పార్టీ నేతలు అని ప్రచారం చేస్తున్నారు. ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం ఇచ్చేందుకే అన్ని సమస్యలు తెలిసిన దిల్ రాజుకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం. ఫిల్మ్ నగర్ ని నెలకొల్పిందే కాంగ్రెస్ పార్టీ. మేం ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేయం. ఇమేజ్ పెంచుకోవడానికే కొందరు అల్లు అర్జున్ అంశంపై మాట్లాడుతున్నారు అంటూ బీజేపీ, బిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ కేసులో బెయిలుపై ఉన్నారు. తొక్కిసలాటలో మహిళ చనిపోగా గాయపడ్డ ఆమె కుమారుడు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పుష్ప నిర్మాతలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డితో కలిసి హాస్పిటల్ కి వెళ్లి ఆ బాబుని పరామర్శించి అతని తండ్రికి 50 లక్షల రూపాయల చెక్కును అందచేశారు.