Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో మృణాల్ ఠాకూర్.. ఏ మూవీ తెలుసా?
పుష్ప 2 (Pushpa 2) టీజర్ తో అమాంతం అంచనాలు పెంచేసిన అల్లు అర్జున్ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

Mrunal Thakur is heroine for Allu Arjun Sandeep Reddy Vanga movie
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ నెలకుంది. ఇటీవలే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రత్యేక వీడియో మరియు పోస్టర్ లు రిలీజ్ చేశారు. అవి చూశాక ఆడియన్స్ లో పుష్ప 2 పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే, అల్లు అర్జున్ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది.
Allu Arjun: పుష్ప రాజ్ కాదు.. కేబుల్ రాజే టాప్ అంటోన్న ఐఎండీబీ
పుష్ప 2 లో అనుకుంటున్నారు ఏమో, కాదండోయ్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నాడని అందరికి తెలిసిందే. ఈ మూవీలో బన్నీకి హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని (Mrunal Thakur) ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రాబోతుంది. మృణాల్ బాలీవుడ్ హీరోయిన్ కావడం, ఇక సీతారామం సినిమాతో సౌత్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకోవడం, కథ పరంగాను ఈ చిత్రానికి మృణాల్ అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట.
Allu Arjun: ఓన్లీ హగ్స్ మాత్రమేనా.. పార్టీ లేదా పుష్ప..? అని అడిగిన తారక్
ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తో యానిమల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ కానుంది. పుష్ప 2 షూటింగ్ కూడా ఆ సమయానికి పూర్తి కానుంది. ఆ వెంటనే సందీప్, బన్నీల సినిమా పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.