SKY : ‘స్కై’ సినిమా టీజర్ రిలీజ్.. రాకేష్ మాస్టర్ చివరి సినిమా..

మీరు కూడా స్కై టీజర్ చూసేయండి..

SKY : ‘స్కై’ సినిమా టీజర్ రిలీజ్.. రాకేష్ మాస్టర్ చివరి సినిమా..

SKY Teaser

Updated On : July 12, 2025 / 3:08 PM IST

SKY : మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘స్కై’. వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మాణంలో పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, గ్లింప్స్ రిలీజ్ అవ్వగా నేడు స్కై సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రేమ, ఎమోషన్ ఉన్నట్టు టీజర్ తెలుస్తుంది. మనీ ట్రాన్సాక్షన్ లో జరిగిన మిస్టేక్ తో హీరో హీరోయిన్స్ మధ్య బాండింగ్ ఏర్పడి అది ప్రేమగా మారి తర్వాత ఏమైంది? హీరో తను అనుకున్న రెస్టారెంట్ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడా అనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది.

Also Read : Swayambhu : బాహుబలి లాగే నిఖిల్ ‘స్వయంభు’ కూడా..

ఈ సినిమాలో రాకేష్ మాస్టర్ కూడా నటించారు. ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. రాకేష్ మాస్టర్ చివరి సినిమాగా స్కై రానుంది. మీరు కూడా స్కై టీజర్ చూసేయండి..

Also Read : Senthil Kumar : రాజమౌళితో ఏ సమస్య లేదు.. మహేష్ సినిమా ఎందుకు చేయట్లేదో చెప్పిన స్టార్ సినిమాటోగ్రాఫర్..