Murali Sharma : ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటుడు మురళీశర్మ.. ఆ వెబ్ సిరీస్ తో..
సీనియర్ నటుడు మురళీశర్మ కూడా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. (Murali Sharma)
Murali Sharma
Murali Sharma : ఇటీవల అనేకమంది హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సినిమాలతో పాటు ఓటీటీలో కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో సిరిస్ లు, సినిమాలు, షార్ట్ ఫిలింస్ కూడా కాదనకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు మురళీశర్మ కూడా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో రకరకాల పాత్రలతో మెప్పించారు మురళీశర్మ. గత కొన్నాళ్లుగా తండ్రి పాత్రల్లో, విలన్ గా తెలుగు సినిమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ద్వారా ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ సిరీస్ లో మురళీ శర్మ కుక్కుటేశ్వరరావు అనే తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. తన కుమారుడు సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా వర్క్ చేస్తున్నాడని తెలిసి నమ్మకాలు, సంప్రదాయాలు అంటూ తిరిగే కుక్కుటేశ్వరరావు ఎలా రియాక్ట్ అయ్యాడు అని కామెడీ ఎమోషనల్ పాత్రలో నటించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా నేడు మీడియాతో మురళీ శర్మ మాట్లాడుతూ.. నవ్విస్తూనే సాధారణంగా మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించే అంశాలపై ఆలోచింపజేసే కథ ఇది. కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, సామాజిక అంశాలను ఈ సిరీస్ లో చూపించారు. మాకిపూర్ గ్రామంలోని లోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్లో భాగం కావడం, ఇదే నా తొలి ఓటీటీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. టిల్లు స్క్వేర్ షూటింగ్ సమయంలో డైరెక్టర్ మల్లిక్ ఈ కథ గురించి చెప్పాడు. కుక్కుటేశ్వరరావు పాత్ర నాకు నచ్చింది. బయటకు కాస్త చిరాకు తెప్పించే, కఠినంగా కనిపించే వ్యక్తి అయినా అదే పాత్రను ఎంతో ఆసక్తికరంగా మారుస్తుంది అని అన్నారు.
