Harsha Chemudu : మా అంకుల్ తప్పిపోయాడు.. ప్లీజ్ వెతికి పెట్టండి.. కమెడియన్ రిక్వెస్ట్..
మా అంకుల్ తప్పిపోయాడు, కాస్త వెతికి పెట్టండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు వైవా హర్ష.

Viva Harsha Chemudu
Viva Harsha Chemudu: షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, కామెడీ కంటెంట్ ఉన్న వీడియోలు, రీల్స్‌తో పాపులర్ అయ్యారు వైవా హర్ష. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన ఇతని పూర్తి పేరు హర్ష చెముడు. సినిమాల్లో కమెడియన్‌గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్‌లో సత్తా చాటుతూ ఉన్నాడు. మా అంకుల్ తప్పిపోయాడు, కాస్త వెతికి పెట్టండి అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
‘మీ అందరిని ఓ పర్సనల్ రిక్వెస్ట్ అడగడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏదైన ప్రాబ్లమ్ పక్క వాళ్లకు వస్తే ఒకలా ఉంటుంది. అది మన వరకు వస్తే గాని తెలియదు. ప్రస్తుతం అలాంటి ఓ సిచ్యువేచన్‌లో ఉన్నాను. ‘అని హర్ష చెప్పాడు.
Sonu Sood : అందరూ టికెట్ల రేట్లు పెంచుతుంటే.. తగ్గించిన సోనూసూద్.. సంక్రాంతి బరిలో..
‘అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న మా అంకుల్ కనిపించకుండా పోయారు. ఆయన వయసు 91 ఏళ్లు. నాలుగు రోజుల క్రితం ఆయన వైజాగ్‌లోని ఇంటి నుంచి వెళ్లిపోయారు. సీసీటీవీ పరిశీలించగా కంచెర్ల పాలెం ఏరియాలో చివరి సారిగా కనిపించారు. ఆయన ఎక్కడైనా కనిపిస్తే తెలియజేయండి,’ అంటూ వైవా హర్ష ఎమోషనల్ అయ్యారు.
View this post on Instagram