Sonu Sood : అంద‌రూ టికెట్ల రేట్లు పెంచుతుంటే.. త‌గ్గించిన సోనూసూద్‌.. సంక్రాంతి బ‌రిలో..

సోనూసూద్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ఫతే.

Sonu Sood : అంద‌రూ టికెట్ల రేట్లు పెంచుతుంటే.. త‌గ్గించిన సోనూసూద్‌.. సంక్రాంతి బ‌రిలో..

Sonu Sood Fateh Ticket price only 99 on releasing day

Updated On : January 8, 2025 / 1:27 PM IST

ఒక‌ప్పుడు ప‌రిమిత బ‌డ్జెట్‌తో సినిమాల‌ను తెర‌కెక్కించేవారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో భారీ బ‌డ్జెట్‌తో సినిమాల‌ను రూపొందిస్తున్నారు. దీంతో తాము పెట్టిన పెట్టుబ‌డిని రాబ‌ట్టుకునేందుకు ఆయా చిత్రాల నిర్మాత‌లు టికెట్ల రేట్లు పెంచ‌డం చూస్తూనే ఉన్నాం. అయితే.. అంద‌రికి కాస్త భిన్నం అని మ‌రోసారి నిరూపించారు బాలీవుడు న‌టుడు సోనూసూద్.

క‌రోనా క‌ష్ట‌కాలం నుంచి నేనునాన్నంటూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొంటూ ముందుకు సాగుతున్నారు సోనూసూద్. తాజాగా ఆయ‌న‌ త‌న చిత్ర టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించారు. సోనూసూద్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ‘ఫతే’. జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్ క‌థానాయిక‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో నసీరుద్దీన్‌ షా, విజయ్‌రాజ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Game changer : గేమ్ ఛేంజ‌ర్ నుంచి ‘కొండ దేవర’ పాట వ‌చ్చేసింది.. విన్నారా?

జీ స్టూడియోస్, శక్తి సాగర్‌ ప్రొడక్షన్స్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మ‌రో రెండు రోజుల్లో (జ‌న‌వ‌రి 10న) ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త అందించారు.

SHARWA-37 : ‘శ‌ర్వా 37’ కోసం నంద‌మూరి, కొణిదెల హీరోలు.. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ డేట్ ఫిక్స్‌..

సినిమా మొద‌టి రోజున టికెట్ ధ‌ర కేవలం రూ.99 అని సోనూసూద్ తెలిపారు. అంటే శుక్ర‌వారం ఒక్క రోజు ఏ థియేట‌ర్‌లో అయినా ఈ చిత్ర టికెట్ ధ‌ర రూ.99 మాత్ర‌మే ఉండ‌నుంది. ఇక‌ ఈ చిత్రం ద్వారా వ‌చ్చిన లాభాల‌ను ఛారిటీకి ఇవ్వ‌నున్నట్లు చెప్పాడు. దీనిపై నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సోనూసూద్ నిజ‌మైన హీరో అని కామెంట్లు చేస్తున్నారు.