Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను....
Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో మాస్ మసాలా సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
‘‘నా పేరు సీసా..’’ అంటూ సాగిన ఈ పాటను సింగర్ శ్రేయా ఘోషాల్ ఆలపించగా, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. ఈ మాస్ సాంగ్‌లో అందాల భామ అన్వేషి జైన్ అందాల ఆరబోతతో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ పాటలో సీసా అంటే ఏమిటో.. అది ఎన్ని రకాలుగా ఉంటుందో చంద్రబోస్ వివరించిన తీరు అద్భుతం. అయితే ఈ పాటలో మాస్ రాజా కూడా తళుక్కుమన్నాడు. పంచె కట్టుకుని సీసా పాపతో రవితేజ చిందులు వేయడం ఆయన అభిమానులను ఆకట్టుకుంది.
Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!
సామ్ సిఎస్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ ఔట్ అండ్ ఔట్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా, జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సీసా కథేమిటో మీరూ ఓసారి లుక్కేయండి.