Sneha Sharma: అడుక్కుతిని బతుకుతా కానీ.. క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్!
సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లపై హీరోయిన్లు ఆరోపణలు చేయడం ఇప్పటికే ఎన్నోసార్లు చూశాం. మీ టూ అంటూ దీనిపై గతంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే నడించింది. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఇప్పటికే..

Sneha Sharma
Sneha Sharma: సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లపై హీరోయిన్లు ఆరోపణలు చేయడం ఇప్పటికే ఎన్నోసార్లు చూశాం. మీ టూ అంటూ దీనిపై గతంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే నడించింది. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఇప్పటికే సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్లు ఉన్నారు. సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఓపెన్ గానే చెప్పేసిన సంగతి తెలిసిందే. ప్రతి రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని.. అది సినీ పరిశ్రమలో అధికంగా ఉంటుందని ఇండస్ట్రీకి చెందిన వారే ఒప్పేసుకున్న కామెంట్స్ కూడా ఉండనే ఉన్నాయి.
Poonam Kaur: బావ మూవీ హిట్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!
తాజాగా నా ప్రేమ నాకు కావాలి ఇండిపెండెంట్ మూవీ హీరోయిన్ స్నేహా శర్మ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్నేహ తనకు ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇలాంటివి నేను కూడా ఫేస్ చేశాను. కమిట్మెంట్ అడిగారు. నో చెప్పినందుకు సినిమాలోంచి తీసేశారు. అలా పెద్ద సినిమాల్లో కూడా అవకాశం కోల్పోయాను.
Samantha: నా కుటుంబం విచ్ఛిన్నమైంది.. సామ్ మనసులో ఇంత బాధ ఉందా?
అడుక్కు తిని అయినా బతుకుతా కానీ ఇలాంటి పనులు చేయను అని చెప్పేశానని చెప్పుకొచ్చింది. అయితే.. క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్లు సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారమే అయినప్పటికీ.. ఇక్కడ బలవంతాలు ఉండవని.. అది మన మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పింది. అడిగేవాళ్లు అడుగుతారు.. కానీ నిర్ణయం మాత్రం మనదే’ ఉంటుందని.. దాని ఫలితం మనమే ఎదుర్కోవాలని తన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.